- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరుణ్ చక్రవర్తిని తీసుకోవడం గొప్ప నిర్ణయం
గురువారం నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభమయ్యే వన్డే సిరీస్ కోసం టీమ్ ఇండియాలోకి వరుణ్ చక్రవర్తిని తీసుకోనున్నట్లు వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రకటించారు.

- మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్
దిశ, స్పోర్ట్స్: టీ20 సిరీస్‌లో రాణించిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని వన్డే జట్టులోకి తీసుకోవడం గొప్ప నిర్ణయమని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ప్రశంసించారు. ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వరుణ్ చక్రవర్తి 14 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లను కట్టడి చేయడంలో విజయం సాధించిన చక్రవర్తి.. భారత జట్టు సిరీస్‌ను 4-1 తేడాతో గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. గురువారం నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభమయ్యే వన్డే సిరీస్ కోసం టీమ్ ఇండియాలోకి వరుణ్ చక్రవర్తిని తీసుకోనున్నట్లు వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రకటించారు. ఈ నిర్ణయంపై స్పందించిన కెవిన్ పీటర్సన్.. అద్భుతమైన నిర్ణయం అని పొగిడారు. అయితే ఇంగ్లాండ్ బ్యాటర్లు 50 ఓవర్ల ఫార్మాట్‌లో వరుణ్‌పై అత్యుత్తమ ప్రదర్శన చేస్తారని అభిప్రాయపడ్డాడు. వన్డేల్లో బ్యాటర్లకు క్రీజులో కుదురుకోవడానికి మరింత సమయం దొరుకుతుంది. ప్రతీ బంతిని బౌండరీకి తరలించాల్సిన అవసరం ఉండదని పీటర్సన్ చెప్పాడు. టీ20ల్లో ఇంగ్లాండ్ జట్టు 1-4 తేడాతో ఓడిపోవడం ఒక డిజాస్టర్‌గా అభివర్ణించాడు. పూణేలో జరిగిన మ్యాచ్‌లో శివమ్ దూబే బదులుగా కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా హర్షిత్ రాణాను తీసుకోకపోయి ఉంటే ఇంగ్లాండ్ జట్టు సిరీస్‌ను సమం చేసి ఉండేదని చెప్పాడు. ఇది ఇంగ్లాండ్‌కు దురదృష్టకరమైన సిరీస్ అని పీటర్సన్ అన్నాడు.






