ఇంగ్లాండ్ నయా ఆల్ రౌండర్.. విశ్వరూపం!

by Geesa Chandu |

ఇంగ్లాండ్ బౌలర్ గా.. టెస్ట్ జట్టులోకి అడుగుపెట్టిన తొలి మ్యాచ్ లోనే గాస్ అట్కిన్సన్ తన అరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్నాడు.

ఇంగ్లాండ్ నయా ఆల్ రౌండర్.. విశ్వరూపం!
X

దిశ, వెబ్ డెస్క్: ఇంగ్లాండ్ బౌలర్ గా.. టెస్ట్ జట్టులోకి అడుగుపెట్టిన తొలి మ్యాచ్ లోనే గస్ అట్కిన్సన్ తన అరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్నాడు. వెస్టిండీస్ తో జరిగిన మూడు మ్యాచ్ ల సిరీస్ లో 22 వికెట్లు పడగొట్టి, 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' గెలుచుకొని శబాష్ అనిపించుకున్న అట్కిన్సన్, ఇప్పుడు తాజాగా శ్రీలంక తో జరుగుతున్న సిరీస్ లో తన బ్యాటింగ్ తోనూ చెలరేగిపోవడం విశేషం.

రెండో రోజు.. లార్డ్స్ వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో అట్కిన్సన్ సెంచరీతో చెలరేగడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. శుక్రవారం(ఆగస్టు 30) నాటి మ్యాచ్ లో 103 బంతుల్లోనే సెంచరీ సాధించి 118 పరుగుల వద్ద ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు, 4 సిక్సర్లు ఉండటం విశేషం. ఇప్పుడు అట్కిన్సన్ స్ట్రైక్ రేట్ 100 కి పైగా ఉండటం అందర్నీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తొలి రోజు 74 పరుగులతో నాటౌట్ తో ఇన్నింగ్స్ కొనసాగించిన ఈ ఇంగ్లీష్ పేసర్.. మైదానంలో బౌండరీలతో చెలరేగుతూ, తన కెరీర్ లో తొలి సెంచరీని నమోదు చేసుకున్నాడు.

అట్కిన్సన్ బ్యాటింగ్ తో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 427 పరుగులకు ఆలౌటైంది. తొలి రోజు ఆటలో రూట్ (143) సెంచరీ బాదాడు. లంక బౌలర్లలో అసిత ఫెర్నాండో కు 5 వికెట్లు దక్కాయి. తర్వాత బ్యాటింగ్ కి దిగిన శ్రీలంక, లంచ్ సమయానికి 2 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. ఓపెనర్లు మదుష్కా(7), కరుణరత్నే(7) విఫలమయ్యారు.

Next Story