మందు మానేసిన స్టోక్స్.. అందుకోసం ఆల్కహాల్‌కు దూరంగా ఉంటున్నాడా?

by Harish |

వచ్చే నెలలో ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే.

మందు మానేసిన స్టోక్స్.. అందుకోసం ఆల్కహాల్‌కు దూరంగా ఉంటున్నాడా?
X

దిశ, స్పోర్ట్స్ : వచ్చే నెలలో ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ కోసం ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ సిద్ధమవుతున్నాడు. తొడకండరాల గాయం, సర్జరీ కారణంగా అతను గతేడాది డిసెంబర్ నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. ఈ నెలలో జింబాబ్వేతో ఏకైక టెస్టుతో అతను తిరిగి మైదానంలో అడుగుపెట్టాలని భావిస్తున్నాడు. అయితే, స్టోక్స్ టార్గెట్ మాత్రం టీమిండియాతో టెస్టు సిరీసే. అందుకు ఫిట్‌గా ఉండేందుకు స్టోక్స్ కీలక నిర్ణయం తీసుకున్నాడట. ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడట. ఈ విషయాన్ని స్టోక్సే స్వయంగా వెల్లడించాడు.

తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న స్టోక్స్.. భారత్‌, ఆస్ట్రేలియాలతో సిరీస్‌లకు ఫిట్‌గా ఉండేందుకు ఆల్కహాల్‌కు దూరంగా ఉంటున్నట్టు తెలిపాడు.గాయంలో ఆల్కహాల్‌ది ఏమైనా పాత్ర ఉందా? అని ఆలోచించానని, పూర్తిగా కోలుకుని మైదానంలోకి అడుగుపెట్టే వరకు మద్యం ముట్టుద్దొని అనుకున్నట్టు తెలిపాడు. జనవరి 2 నుంచి తాను మద్యం తీసుకోవడం లేదని చెప్పాడు. అయితే, పూర్తిగా ఆల్కహాల్ మానేసే ఉద్దేశం లేదన్నాడు.


Next Story