నేడు టీమిండియా, ఇంగ్లండ్ మధ్య రెండో టీ20

by velandi.Saikiran |

భారత మహిళల జట్టు మరో బిగ్ ఫైట్ కు సిద్ధమైంది. ఇవాళ మహిళల ఇంగ్లాండ్ జట్టుతో టీమిండియా మహిళల టీం మధ్య రెండో

నేడు టీమిండియా, ఇంగ్లండ్ మధ్య రెండో టీ20
X

దిశ, వెబ్ డెస్క్ : భారత మహిళల జట్టు మరో బిగ్ ఫైట్ కు సిద్ధమైంది. ఇవాళ మహిళల ఇంగ్లాండ్ జట్టుతో టీమిండియా మహిళల టీం మధ్య రెండో టి20 జరగనుంది. బ్రిస్టల్ లో ( Bristol) టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రెండో టి20 మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటల సమయంలో ప్రారంభమవుతుంది. మొదటి టి20 మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే.

స్మృతి మందాన (Smriti Mandana) అద్భుత సెంచరీతో... మొదటి టి20 గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇక ఇవాళ కూడా ఇంగ్లాండ్ జట్టును చిత్తు చేసి.. సిరీస్ లో ఆదిక్యం సాధించాలని చూస్తోంది. అటు ఐదు మ్యాచ్ ల సిరీస్ లో రెండో టి20 నుంచి వరుసగా మ్యాచ్ లు గెలవాలని... ఇంగ్లాండ్ స్కెచ్ లు వేస్తోంది. మరి.. ఈ నేపథ్యంలో రెండో టి20 ఎవరు గెలుస్తారో చూడాలి. ఈ ఐదు టి 20 మ్యాచ్ లు పూర్తికాగానే... 3 వన్డేలు ప్రారంభం కానున్నాయి. ఇక అటు... పురుషుల ఇండియా జట్టు కూడా ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇంగ్లాండ్: డానీ వ్యాట్-హాడ్జ్, సోఫియా డంక్లీ, నాట్ స్కైవర్-బ్రంట్ (c ), టామీ బ్యూమాంట్, అమీ జోన్స్ (wk), ఆలిస్ కాప్సే, ఎమ్ ఆర్లాట్, సోఫీ ఎక్లెస్టోన్, లిన్సే స్మిత్, లారెన్ ఫైలర్, లారెన్ బెల్.

ఇండియా: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, హర్లీన్ డియోల్/హర్మన్‌ప్రీత్ కౌర్ (c), జెమిమా రోడ్రిగ్స్, అమంజోత్ కౌర్, రిచా ఘోష్ (wk), దీప్తి శర్మ, రాధా యాదవ్, స్నేహ్ రాణా, శ్రీ చరణి, అరుంధతి రెడ్డి.

Next Story