ఇంగ్లాండ్ విజ‌యం..పాకిస్తాన్ కు బంప‌ర్ ఆఫ‌ర్‌, సెమీస్‌ చేరే ఛాన్స్‌

by velandi.Saikiran |   (  Updated:2026-02-27 18:13:03  IST  )

న్యూజిలాండ్ పై ఇంగ్లాండ్ విజ‌యం సాధించిన నేప‌థ్యంలో పాకిస్తాన్ కు సెమీస్ ఛాన్సులు పెరిగాయి.

ఇంగ్లాండ్ విజ‌యం..పాకిస్తాన్ కు బంప‌ర్ ఆఫ‌ర్‌, సెమీస్‌ చేరే ఛాన్స్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టీ20 వరల్డ్ కప్ 2026 లో పాకిస్తాన్ కథ ఇంకా ముగియలేదు. శుక్రవారం జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ పైన న్యూజిలాండ్ విజయం సాధించి ఉంటే, పాకిస్తాన్ బ్యాగులు సర్దుకోవాల్సి వచ్చేది. కానీ జస్ట్ లో పాకిస్తాన్ ఈ గండం నుంచి తప్పించుకుంది. న్యూజిలాండ్ పై ఇంగ్లాండ్ విజయం సాధించిన నేపథ్యంలో పాకిస్తాన్ సెమీస్ ఛాన్సులు పెరిగాయి. శనివారం శ్రీలంకపై పాకిస్తాన్ విజయం సాధిస్తే.. సెమీస్ కు వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ అది చాలా సులభం కాదు. శ్రీలంకపై భారీ తేడాతో పాకిస్తాన్ గెలవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.

పాకిస్తాన్ సెమీస్ సినారియో ఇదే

టీ20 వరల్డ్ కప్ 2026 లో సెమీస్ చేరాలంటే పాకిస్తాన్ అద్భుతమే చేయాలి. శ్రీలంక పై భారీ పరుగుల తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది. సూపర్ 8 లో భాగంగా శనివారం పల్లెకేలే స్టేడియం వేదికగా పాకిస్తాన్, శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభమవుతుంది. అయితే, ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవేళ పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేస్తే, శ్రీలంక పైన 65 పరుగుల తేడాతో విజయం సాధించాలి. లేదా మొదట పాకిస్తాన్ బౌలింగ్ చేస్తే, ఛేజింగ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు శ్రీలంక విధించిన టార్గెట్ ను 13 ఓవర్లలోనే ఫినిష్ చేయాలి. అప్పుడు పాకిస్తాన్ నెట్ రన్ రేట్ పెరిగి న్యూజిలాండ్ ను క్రాస్ చేసే ఛాన్సులు ఉంటాయి.

శ్రీలంక పైన విజయం సాధిస్తుంది కాబట్టి న్యూజిలాండ్, పాకిస్తాన్ ఖాతాలో సమానంగా పాయింట్లు ఉంటాయి. అప్పుడు నెట్ రన్ రేట్ కీలక అంశంగా మారుతుంది. పైన పేర్కొన్నట్లు పాకిస్తాన్ భారీ విజయాన్ని నమోదు చేసుకుంటే, న్యూజిలాండ్ కంటే ఎక్కువ నెట్ రన్ రేట్ సాధిస్తుంది. అప్పుడు పాకిస్తాన్ సెమీస్ కు వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా జరగకపోతే న్యూజిలాండ్ కు ఛాన్స్ కచ్చితంగా ఉంటుంది. ఇక శ్రీలంక, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే మాత్రం దేవుడు కూడా కాపాడలేడు. అప్పుడు న్యూజిలాండ్ నేరుగా సెమీస్‌కు దూసుకు వెళ్తుంది.

న్యూజిలాండ్ పై ఇంగ్లాండ్ బంప‌ర్ విజ‌యం

టీ20 వరల్డ్ కప్ 2026 లో భాగంగా శుక్రవారం ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో గెలిస్తే సెమీస్ కు సులభంగా వెళ్లే అవకాశాన్ని కోల్పోయింది న్యూజిలాండ్. చేజేతుల మ్యాచ్ ఓడిపోయింది న్యూజిలాండ్. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. అయితే మొదట అదరగొట్టిన న్యూజిలాండ్ బ్యాటర్లు, చివరి వరకు కొనసాగ లేక పోయారు. దీంతో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే సాధించింది న్యూజిలాండ్. ఇక ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ కూడా కాస్త తడబడింది. అయినప్పటికీ 19.3 ఓవర్లలో ఆర్ వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేదించింది ఇంగ్లాండ్. దీంతో సూపర్ 8లో ఒక్క ఓటమి లేకుండా సెమీస్ లో అడుగు పెట్టింది ఇంగ్లాండ్.

Next Story