- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓవల్ టెస్ట్ : పీకల్లోతు కష్టాల్లో భారత్
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ(Anderson-Tendulkar Trophy)లో భాగంగా ఇంగ్లండ్, భారత్(ENG vs IND) మధ్య ఓవల్ స్టేడియం వేదికగా నేడు ఐదవ టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ(Anderson-Tendulkar Trophy)లో భాగంగా ఇంగ్లండ్, భారత్(ENG vs IND) మధ్య ఓవల్ స్టేడియం వేదికగా నేడు ఐదవ టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్ కు దిగింది. అయితే మొదటి రోజు ఆట పూర్తికాకముందే భారత్ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. 123 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. జైస్వాల్(2), రాహుల్(14), సుదర్శన్(38), గిల్(21), జడేజా(9) పరుగులు మాత్రమే చేసారు.
ప్రస్తుతం కరుణ్ 18*, జురెల్ 7* పరుగులతో క్రీజులో ఉండగా.. 46 ఓవర్లకు 137 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది భారత్. ఇంగ్లండ్ బౌలర్స్ లో జోష్ 2, వోక్స్, అట్కిన్సన్ తలో వికెట్ తీశారు. ఐదు టెస్టుల సిరీస్ లో 2-1 స్కోర్ తో ఇంగ్లండ్ ముందజలో ఉంది. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తేనే సిరీస్ డ్రా అవుతుంది. లేదంటే ట్రోఫీ ఇంగ్లండ్ దక్కించుకున్నట్టే.






