- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్ట్
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఇవాల్టి నుంచి నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది. ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా... ఇప్పటికే

దిశ, వెబ్ డెస్క్ : టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఇవాల్టి నుంచి నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది. ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా... ఇప్పటికే మూడు టెస్టులు పూర్తికాగా.. ఇవాళ మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్ట్ ప్రారంభం అవుతుంది. ఈ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరిగాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో... టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్ ప్రారంభమవుతుంది.
మూడు గంటల సమయంలో టాస్ ప్రక్రియ ఉంటుంది. అయితే ఈ నాలుగో టెస్ట్ టీమ్ ఇండియాకు చాలా కీలకం. మూడు టెస్టుల్లో ఒకే ఒక్క టెస్ట్ గెలిచి వెనుకబడి ఉంది టీమిండియా. కాబట్టి ఇవాళ జరిగే నాలుగో టెస్ట్ గెలిచి సిరీస్ సమం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవేళ ఇంగ్లాండ్ గెలిస్తే సిరీస్ కోల్పోవడం గ్యారంటీ. ఈ నేపథ్యంలో... టీమిండియా ఆచితూచి ఆడాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేకాదు ఇవాల్టి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. అర్ష్ దీప్, నితీష్ కుమార్ రెడ్డి అలాగే ఆకాష్ దీప్ ఈ ముగ్గురికి గాయాలయ్యాయి. వీళ్ళ స్థానంలో కొత్త ప్లేయర్లు బరిలోకి దిగిన ఉన్నారు.
జట్ల అంచనా
టీమిండియా: యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (c), రిషబ్ పంత్ (vc & wk), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్/శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, అన్షుల్ కాంబోజ్.
ఇంగ్లాండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (c), జామీ స్మిత్ (WK), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్






