- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేటి నుంచే లార్డ్ టెస్ట్... టీమిండియాను వణికిస్తున్న రికార్డులు !
లార్డ్స్ వేదికగా (Lords).. బిగ్ ఫైట్ ఇవాళ ప్రారంభం కానుంది. టీమిండియా ( Team India) వర్సెస్ ఇంగ్లాండ్ ( England) మధ్య నే

దిశ, వెబ్ డెస్క్: లార్డ్స్ వేదికగా (Lords).. బిగ్ ఫైట్ ఇవాళ ప్రారంభం కానుంది. టీమిండియా ( Team India) వర్సెస్ ఇంగ్లాండ్ ( England) మధ్య నేటి నుంచి మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. లండన్ లోని లార్డ్స్ వేదికగా.. ఈ రెండు జట్ల మధ్య మూడవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం.. టాస్ ప్రక్రియ మధ్యాహ్నం మూడు గంటలకు ఉంటుంది. అలాగే.. మ్యాచ్ ప్రారంభం మాత్రం మధ్యాహ్నం మూడున్నర గంటలకు కానుంది. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు జరిగాయి.
అయితే.. ఇవాల్టి మ్యాచ్ నేపథ్యంలో... నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి టీమిండియా దిగనుందని అంటున్నారు. సిరాజ్, ఆకాష్ దీప్ తో పాటు ఇవాల్టి టెస్ట్ మ్యాచ్ లో బుమ్రా కూడా రంగంలోకి దిగబోతున్నట్లు చెబుతున్నారు. బుమ్రా తో అర్ష్ దీప్ కూడా వస్తాడని అంటున్నారు. ఇక అటు ఇంగ్లాండు జట్టులోకి... అర్చర్ వస్తున్నాడు. దీంతో టీమిండియా కాస్త.. జాగ్రత్తగా ఆడాలని చెబుతున్నారు క్రీడా విశ్లేషకులు.
ఇక లార్డ్స్ రికార్డులు పరిశీలిస్తే.... ఇప్పటివరకు టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్ వేదికగా 19 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో ఇంగ్లాండ్ పై చేయి సాధించింది. లార్డ్స్ వేదికగా ఏకంగా ఇంగ్లాండ్ 12 మ్యాచ్ లు కైవసం చేస్తుంది. టీమిండియా కేవలం మూడు అంటే మూడు మ్యాచ్ ల్లో మాత్రమే విజయం సాధించింది. అలాగే ఈ రెండు జట్ల మధ్య 4 మ్యాచ్ లు డ్రా అయ్యాయి. దీంతో టీమ్ ఇండియాలో కొత్త టెన్షన్ మొదలైంది. లార్డ్స్ లో ఎలాగైనా గెలవాలని ప్లాన్ చేస్తోంది.






