- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు వన్డే మ్యాచ్...కోహ్లీ-రోహిత్ ఎంట్రీ, మ్యాచ్ టైమ్మింగ్స్ లో మార్పు
ఇంగ్లాండ్, భారత జట్ల మధ్య జరుగుతున్న ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఇంగ్లాండ్, భారత జట్ల మధ్య నేటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇవాళ మధ్యాహ్నం మూడున్నర గంటలకు తొలి వన్డే ప్రారంభం అవుతుంది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. ఈ లెక్కన అర్ధరాత్రి 11 గంటల వరకు మ్యాచ్ కొనసాగుతుందన్నమాట. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన జట్టు, మొదట బ్యాటింగ్ చూసుకుంటే బెటర్ అంటున్నారు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రీ-ఎంట్రీ
ఇంగ్లాండ్, భారత జట్ల మధ్య జరుగుతున్న ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో కెప్టెన్ గా గిల్ వ్యవహరించనున్నాడు. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నారు. అటు బుమ్రా చాలా రోజుల తర్వాత వన్డే జట్టులో ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ వైస్ కెప్టెన్ గా కొనసాగుతాడు. వికెట్ కీపర్ గా రాహుల్ ఉంటాడు. టీ20 సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో.. ప్రతికారంగా వన్డే సిరీస్ గెలవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగుతోంది భారత జట్టు.
భారత్ ప్రాబబుల్ ఎలెవన్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, జస్ప్రీత్ బుమ్రా






