- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో నేడు కూడా కాలేజీలు బంద్ !
by velandi.Saikiran |
తెలంగాణలో నేడు కూడా కాలేజీలు బంద్ కానున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇవాళ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలు మూతపడనున్నాయి. ఏబీవీపీ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నేడు కాలేజీలు బంద్ కానున్నట్లు సమాచారం అందుతోంది. పెండింగ్ లో ఉన్న రూ.12,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ బకాయిలు రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తోంది ఏబీవీపీ. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ నిరసనకు దిగుతోంది. సుమారు 20 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈ-బీసీ, మైనారిటీ విద్యార్థులపై ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రభావం పడుతోందని సర్కార్ పై తీవ్ర ఒత్తిడి తీసుకు వస్తోంది ఏబీవీపీ. ఈ క్రమంలోనే ప్రభుత్వ తీర్పు నిరసనగా జూనియర్ కాలేజీల నుంచి యూనివర్సిటీల వరకు బంద్ పాటించాలని పిలుపునిచ్చింది. దీంతో ఇవాళ కూడా కాలేజీలు మూతపడనున్నట్లు తెలుస్తోంది.
Next Story






