2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో రోహిత్, కోహ్లీ ఆడ‌టంపై గిల్ ప్ర‌క‌ట‌న‌

by velandi.Saikiran |   (  Updated:2026-07-14 01:16:03  IST  )

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో రోహిత్, కోహ్లీ ఆడ‌టంపై గిల్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో రోహిత్, కోహ్లీ ఆడ‌టంపై గిల్ ప్ర‌క‌ట‌న‌
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇంగ్లాండ్ తో నేటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇలాంటి నేపథ్యంలో రోకో అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందించాడు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గిల్. 2027 వన్డే వరల్డ్ కప్ ప్లాన్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నారని స్పష్టం చేశారు. దక్షిణాఫ్రికాలో ఏ కాంబినేషన్ బెస్ట్.. ఏ ప్లేయర్ హెల్ప్ అవుతారని అంశాలపై చర్చ మొదలైందని.. ఆ దిశగా తాము వర్క్ చేస్తున్నట్లు గిల్ వెల్లడించారు. దశాబ్ద కాలంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా జట్టుకు బ్యాక్ బోన్ గా నిలిచినట్లు గుర్తు చేశారు.

ఇక ముందు కూడా వాళ్లు జట్టులో భాగంగానే ఉంటారని ప్రకటించారు. దీంతో 2027 వన్డే వరల్డ్ కప్ లో రోకో కాంబినేషన్ ఉంటుందని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ క్రమంలో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇది ఇలా ఉండగా భారత్, ఇంగ్లాండ్ మధ్య ఇవాళ మధ్యాహ్నం మూడున్నర గంటలకు తొలి వన్డే ఉండనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా రీ-ఎంట్రీ ఇవ్వనున్నారు. అంతేకాదు టీ20 సిరీస్ కైవసం చేసుకున్న ఇంగ్లాండ్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు కూడా సిద్ధమయ్యారు.

Next Story