మినీ మార్టులుగా రేషన్ షాపులు.. ఈ నెలలోనే షురూ!

by velandi.Saikiran |

ఏపీలోని రేషన్ షాపులు ఇక‌పై మినీ మార్టులుగా రూపాంత‌రం చెంద‌నున్నాయి.

మినీ మార్టులుగా రేషన్ షాపులు.. ఈ నెలలోనే షురూ!
X

దిశ‌, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్. ఏపీలోని రేషన్ షాపులు ఇక‌పై మినీ మార్టులుగా రూపాంత‌రం చెంద‌నున్నాయి. ఏపీలో ఉన్న 29,794 రేషన్ దుకాణాలను మినీ మార్టులుగా మార్చేందుకు రంగం సిద్ధం చేసింది సర్కార్. పైలట్ ప్రాజెక్టు కింద గుంటూరు, కృష్ణ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలలో కనీసం 200 స్క్వేర్ ఫీట్ ఏరియా ఉన్న 533 దుకాణాలను ముందుగా మినీ మార్టులుగా మార్చేందుకు ఏర్పాట్లు చేసింది.

ఇందులో భాగంగానే గుంటూరు జిల్లాలో ఈ నెలలోనే పది మార్టులు ప్రారంభం కూడా కానున్నట్లు అధికారులు వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టు సక్సెస్ అయితే దశలవారీగా అన్ని దుకాణాలను ఇలాగే మార్టులుగా మార్చనున్నారు. వీటిలో నిత్యవసర వస్తువులు సరసమైన ధరలకు మాత్రమే లభించేలా చూడనున్నారు. దీని వల్ల మధ్యతరగతి, పేద వాళ్లకు లాభం చేకూర‌నుంది.

Next Story