22 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ సరికొత్త రికార్డు..

by Dishanational4 |
22 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ సరికొత్త రికార్డు..
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లాండ్ జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది. రావల్పిండి వేదికగా పాకిస్తాన్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో.. ఇంగ్లాండ్ 74 పరుగుల తేడాతో గెలిచింది. 343 పరుగుల ఛేదనకు బరిలోకి దిగిన పాక్‌ గెలుపునకు ఇంకా 263 పరుగులు అవసరం ఉంది. అయితే ఓవర్‌నైట్‌ స్కోరు 80/2తో బరిలోకి దిగిన పాక్‌ రెండో ఇన్నింగ్స్‌లో 268 పరుగులకు ఆలౌటైంది. ఆ విజయంతో టెస్ట్‌ క్రికెట్‌లో సరికొత్త రికార్డు ఇంగ్లాండ్ నమోదు చేసింది. కాగా ఇంగ్లాండ్ 2000 డిసెంబర్‌లో విజయం సాధించగా.. దీంతో దాదాపు 22 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు సృష్టించింది. అంతేకాక పాకిస్తాన్‌పై ఈ విజయం మూడోవది కావడం విశేషం.

ఇవి కూడా చదవండి : ఒక టెస్టు చరిత్రలో అత్యధిక పరుగులు.. ప్రపంచ రికార్డు బద్దలు


Next Story

Most Viewed