- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐదో టెస్టుకు ముందు ఇంగ్లాండ్‌కు షాక్.. గాయంతో కెప్టెన్ బెన్ స్టోక్స్ అవుట్
సచిన్-అండర్సన్ టెస్ట్ సిరీస్ (Sachin-Anderson Test Series)లో భాగంగా భారత్ (India), ఇంగ్లాండ్ (England) జట్ల మధ్య ఐదో టెస్ట్ గురువారం లండన్‌లోని ఓవల్ వేదికగా జరగనుంది.

దిశ, వెబ్‌డెస్క్: సచిన్-అండర్సన్ టెస్ట్ సిరీస్ (Sachin-Anderson Test Series)లో భాగంగా భారత్ (India), ఇంగ్లాండ్ (England) జట్ల మధ్య ఐదో టెస్ట్ గురువారం లండన్‌లోని ఓవల్ వేదికగా జరగనుంది. అయితే, ఆతిథ్య జట్టు 2-1 ఆధిక్యంలో ఉండగా.. టీమిండియా ఎలాగైనా సిరీస్‌ను సమం చేసి సొంతగడ్డపై ఇంగ్లాండ్‌ను చిత్తు చేయాలని చూస్తోంది. ఈ క్రమంలోనే ఇంగ్లీష్ టీమ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లను నేలకూల్చిన కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) కుడి భుజం గాయం కారణంగా ఐదో టెస్ట్‌కు దూరమయ్యాడు. ఈ మేరకు ఈసీబీ సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి టెస్ట్‌కు తుది జట్టును కాసేపటి క్రితం ప్రకటించింది. కెప్టెన్‌గా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఓలీ పోప్ వ్యవహరించనున్నాడు. జట్టులోకి కొత్తగా జాకబ్ బెథెల్, గన్ అట్కిన్సన్, జామీ ఓవర్టన్ చేరారు.
ఇంగ్లాండ్ తుది జట్టు ఇదే..
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జామీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జామీ ఓవర్టన్, జోష్ టంగ్






