ICC Champions Trophy : ఇంగ్లాండ్ ఆటగాళ్లు అదే మాట !

by Y. Venkata Narasimha Reddy |

ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)లో ఒకే వేదిక దుబాయ్(Dubai)లోనే భారత్ క్రికెట్ జట్టు(India cricket team) ఆడనుండటం ఆ జట్టుకు బలమని(Advantage) ఆసీస్ కేప్టెన్ ప్యాట్ కమిన్స్(Australia Captain Pat Cummins) చేసిన వ్యాఖ్యలపై రేగిన దుమారం మరువకముందే ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు(Former England cricketers) నాజర్ హుస్సేన్(Nasser Hussain), మైఖేల్ అథర్టన్(Michael Atherton)లు కూడా అదే రకమైన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.

ICC Champions Trophy : ఇంగ్లాండ్ ఆటగాళ్లు అదే మాట !
X

దిశ, వెబ్ డెస్క్ : ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)లో ఒకే వేదిక దుబాయ్(Dubai)లోనే భారత్ క్రికెట్ జట్టు(India cricket team) ఆడనుండటం ఆ జట్టుకు బలమని(Advantage) ఆసీస్ కేప్టెన్ ప్యాట్ కమిన్స్(Australia Captain Pat Cummins) చేసిన వ్యాఖ్యలపై రేగిన దుమారం మరువకముందే ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు(Former England cricketers) నాజర్ హుస్సేన్(Nasser Hussain), మైఖేల్ అథర్టన్(Michael Atherton)లు కూడా అదే రకమైన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.

ఛాంపియన్స్ ట్రోఫీ సొంతగడ్డపై జరగనుండడంతో పాకిస్థాన్ కు ఈ మెగా టోర్నీకి అనుకూలంగా మారుతుందని అంతా అనుకున్నారని..కాని ట్రోఫీ భారత్ కు అనుకూలంగా మారిందని వారు చెప్పారు. ఇందుకు భారత్ ఒకే వేదిక దుబాయ్ లోనే మ్యాచ్ లు ఆడటం కారణమని వారు స్పష్టం చేశారు. మైఖేల్ అథర్టన్ మాట్లాడుతూ ఇండియా ఒకే వేదికపై ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతుందని..ఇతర జట్లు మాత్రం వేదికలు మారాల్సి వస్తుందని..పైగా వీరు వేరే దేశాలు ప్రయాణించాల్సి ఉందని గుర్తు చేశారు.

కానీ టీమిండియాకు ఆ అవసరం లేదని..వారు ఒకే వేదికపై అన్ని మ్యాచ్ లు ఆడుతూ పరిస్థితులను అలవాటు చేసుకోవచ్చని.. ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా ఆడుకోవచ్చని అన్నాడు. మరో ఇంగ్లాండ్ ఆటగాడు నాజర్ హుస్సేన్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. సెమీస్, ఫైనల్ కు వస్తే మ్యాచ్ లు ఎక్కడ ఆడాలో భారత్ కు బాగా తెలుసని..అప్పటిలోగా దుబాయ్ లోని పరిస్థితులకు వారు అలవాటు పడతారని..అన్ని జట్లతో పోలిస్తే ఈ విషయం భారత జట్టుకు కలిసొస్తుందన్నాడు.

నిజానికి ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిధ్యమిచ్చినా ఈ టోర్నీని భారత్ అనుకూలంగా మార్చుకుందని హుస్సేన్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. మొత్తంగా అసీస్, ఇంగ్లాండ్ క్రికెటర్ల అభిప్రాయాలు చూస్తే ఒకే వేదికలో ఆడటం భారత్ కు టోర్నీలో ప్రయోజకరంగా ఉంటుందని స్పష్టమవుతున్నప్పటికి..ఈ కారణంతో భారత్ సాధించే విజయాలు తక్కువ చేయడం సరికాదని క్రీడాభిమానులు కామెంట్ చేస్తున్నారు.

Next Story