లార్డ్స్ టెస్ట్ గెలిచిన ఇంగ్లాండ్ కు ఎదురుదెబ్బ..ఆ స్టార్ ఆటగాడు దూరం

by velandi.Saikiran |

అండర్సన్ - సచిన్ టోర్నీ నేపథ్యంలో ఇంగ్లాండ్ దూసుకుపోతోంది. ఐదు టెస్టుల సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచ్ లు గెలిచింది

లార్డ్స్ టెస్ట్ గెలిచిన ఇంగ్లాండ్ కు ఎదురుదెబ్బ..ఆ స్టార్ ఆటగాడు దూరం
X

దిశ, వెబ్ డెస్క్: అండర్సన్ - సచిన్ టోర్నీ నేపథ్యంలో ఇంగ్లాండ్ దూసుకుపోతోంది. ఐదు టెస్టుల సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచ్ లు గెలిచింది ఇంగ్లాండ్. దీంతో ఈ సిరీస్ లో 2-1 తేడాతో ఇంగ్లాండు ముందంజలోకి వెళ్ళింది. అయితే... నిన్న లార్డ్స్ టెస్ట్ గెలిచిన ఇంగ్లాండ్ కు.. ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అండర్సన్ - సచిన్ టోర్నీ నుంచి ఇంగ్లాండ్ ఏకైక స్పిన్నర్ షోయబ్ బషీర్ ( Shoaib Bashir ) దూరం కాబోతున్నాడు.

ఇక మిగిలిన రెండు మ్యాచ్ లకు అందుబాటులో ఉండలేకపోతున్నారు షోయబ్ బషీర్. దింతో మంచి దూకుడుగా ఉన్న ఇంగ్లాండ్ కు ఇది గట్టి ఎదురుదెబ్బ కానుంది. కాగా, ఇండియా - ఇంగ్లాండ్ మూడో టెస్ట్ లో రవీంద్ర జడేజా ( Ravindra Jadeja) బలంగా కొట్టిన బంతిని ఆపడానికి బషీర్ తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో షోయబ్ బషీర్ చిటికెన వేలుకు బలంగా దెబ్బ తగిలింది.

దీంతో అతడు మైదానంలోనే నొప్పితో విలవిలలాడాడు. అనంతరం మైదానం నుంచి బయటకు వెళ్ళాడు షోయబ్ బషీర్. కాగా, నిన్న జరిగిన మ్యాచ్ లో ఇండియా ఓటమిపాలైంది. కేవలం 22 పరుగుల తేడాతో ఇండియాపై ఇంగ్లాండ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉండగా టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మరో రెండు టెస్టులు ఉన్న సంగతి తెలిసిందే. జూలై 23వ తేదీ నుంచి 4వ టెస్టు మంచేస్టర్ వేదికగా ప్రారంభం కానుంది. అలాగే జులై 31వ తేదీ నుంచి లండన్ లోని ఓవల్ లో ఐదవ టెస్ట్ జరుగుతుంది.

Next Story