- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంగ్లండ్ సరికొత్త చరిత్ర..20 ఓవర్లలో 300+ రన్స్..వన్డేల్లోనూ రికార్డు
టి20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది ఇంగ్లాండ్ టీం ( England). క్రికెట్ కనిపెట్టిన ఇంగ్లాండ్... టి20

దిశ, వెబ్ డెస్క్ : టి20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది ఇంగ్లాండ్ టీం ( England). క్రికెట్ కనిపెట్టిన ఇంగ్లాండ్... టి20 తో పాటు వన్డేల్లో కూడా..హైయ్యెస్ట్ టోటల్ నమోదు చేసిన జట్టుగా... రికార్డులోకి ఎక్కింది. తాజాగా ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా ( EngVsSA) మధ్య రెండో టి20 జరిగిన సంగతి తెలిసిందే. మంచెస్టర్ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో.. కేవలం రెండు వికెట్లు కోల్పోయి 304 పరుగులు చేసింది. దీంతో.. ఫుల్ మెంబర్ జట్టుపై టి20 లలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ఇంగ్లాండ్ రికార్డు సృష్టించింది.
అంతకు ముందు ఈ రికార్డు టీమిండియా పేరు పైన ఉంది. గత సంవత్సరం బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 297 పరుగులు చేసింది. ఇప్పుడు ఆ రికార్డును ఇంగ్లాండ్ బ్రేక్ చేసింది. ఈ ఒక్క టి20 లోనే కాదు... వన్డేల్లో కూడా... అత్యధిక పరుగులు చేసింది ఇంగ్లాండ్. నెదర్లాండ్ జట్టు పైన 2022లో.. నిర్ణీత 50 ఓవర్ లో నాలుగు వికెట్లు నష్టపోయి 498 పరుగులు చేసింది ఇంగ్లాండ్. అంటే టి20 లు, వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ఇంగ్లాండ్ రికార్డు సృష్టించింది. ఇది ఇలా ఉండగా సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్లో.... 146 పరుగుల తేడాతో భారీ విక్టరీ నమోదు చేసింది ఇంగ్లాండ్. ఈ మ్యాచ్ లో పిల్ సాల్ట్ 141 పరుగులు చేయగా...బట్లర్ 83 పరుగులు చేశాడు. బ్రూక్ 41 పరుగులు చేసి దుమ్ము లేపాడు.






