- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంగ్లండ్ టీంలో కీలక మార్పు.. బషీర్ అవుట్.. 8 ఏళ్ల తర్వాత అతనికి పిలుపు!
నాలుగో టెస్టుకు ఇంగ్లండ్ టీంలో కీలక మార్పు చేశారు. గాయంతో స్పిన్నర్ బషీర్ తప్పుకోగా, అతని స్థానంలో 8 ఏళ్ల తర్వాత డాసన్‌కు పిలుపు దక్కింది.

దిశ, స్పోర్ట్స్: టీమిండియాతో నాలుగో టెస్టు ఆడే జట్టులో ఇంగ్లండ్ కీలక మార్పు చేసింది. లార్డ్స్ టెస్టులో జడేజా ఇచ్చిన క్యాచ్‌ను అందుకోబోయి గాయపడిన షోయబ్ బషీర్.. మిగతా సిరీస్ ఆడటం లేదని ప్రకటించింది. అతని స్థానంలో లియామ్ డాసన్‌ను ఆడిస్తున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. సీనియర్ ప్లేయర్ అయిన డాసన్.. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత టీంలోకి ఎంట్రీ ఇస్తుండటం గమనార్హం. చివరగా 2017లో సౌతాఫ్రికాపై టెస్టు సిరీస్ ఆడిన అతను.. మూడు మ్యాచుల్లో ఏడు వికెట్లతో రాణించాడు. ఇటీవల వెస్టిండీస్‌తో ఇంగ్లండ్ ఆడిన టీ20 సిరీసులో ఐదు వికెట్లతో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా నిలిచాడు.
నాలుగో టెస్టుకు ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సె, జాక్ క్రాలీ, లియామ్ డాసన్, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, జేమీ స్మిత్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్






