- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘బాజ్ బాల్’ కోసం చీప్ ట్రిక్స్..? బౌండరీ దూరం తగ్గించిన ఇంగ్లండ్
‘బాజ్ బాల్’ కోసం చీప్ ట్రిక్స్ చేస్తోంది ఇంగ్లండ్. ఎడ్జ్‌బాస్టన్‌లో బౌండరీ దూరం తగ్గించినట్లు కనిపిస్తోంది.

దిశ, స్పోర్ట్స్: ‘క్రికెట్‌లో క్రీడాస్ఫూర్తికి ప్రాణమిస్తాం. మా కన్నా ఆటకు గౌరవం ఇచ్చే వాళ్లే లేరు’ ఇలా సొంత డబ్బా కొట్టుకునే టీమ్స్‌లో నెంబర్ వన్ ఇంగ్లండ్. అదే టైంలో గెలవడం కోసం రూల్స్‌లో ఉన్న లూప్ హోల్స్ అన్నీ వాడుకుంటూనే ఉంటుందీ టీం. తాజాగా భారత్‌తో జరుగుతున్న ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఈ విషయం మరోసారి రుజువైంది. ఈ మ్యాచులో బౌండరీ లైన్‌లు చాలా దగ్గరకు మార్చారు. అంటే బౌండరీ దూరాన్ని భారీగా తగ్గించారన్నమాట. ముఖ్యంగా స్కోరు బోర్డు దగ్గర చూస్తే.. బౌండరీని ఇంత తగ్గించారా? అని ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోతారు. కామెంటరీలో ఉన్న ఇంగ్లండ్ మాజీలు కూడా.. ‘స్కోరు బోర్డుకు, బౌండరీ గీతకు మధ్యలో ఉన్న ఖాళీలో పిల్లల గేమ్ ఆడించొచ్చు’ అన్నారంటేనే అక్కడ ఎంత స్పేస్ వదిలిపెట్టారో అర్థం చేసుకోవచ్చు. ఈ గ్రౌండ్‌లో లాంగెస్ట్ బౌండరీ 65 మీటర్లే ఉంది. కొన్ని చోట్ల అయితే ఐసీసీ రూల్స్ ప్రకారం ఉండాల్సిన అత్యల్ప దూరం (59.43 మీటర్లు) కూడా కనిపించింది. ఐసీసీ రూల్స్ ప్రకారం మ్యాగ్జిమమ్ 90 మీటర్ల బౌండరీ ఉండొచ్చు. అందుకని ఇంత భారీ బౌండరీలు ఉండాలని ఎవరూ అనడం లేదు. కానీ కనీసం దూరం ఉండాలి కదా.
ఇలా బౌండరీ లైన్‌ను సాధ్యమైనంత చిన్నగా ఎందుకు చేశారని ఆలోచిస్తేనే వస్తుంది చిక్కు. ఎందుకంటే.. ఇటీవలి కాలంలో టెస్టు కోచ్‌గా బ్రెండన్ మెకల్లమ్ వచ్చిన తర్వాత ఇంగ్లండ్ ఆటతీరు మారిన సంగతి తెలిసిందే. ‘బాజ్ బాల్’ ఆటతో గెలవడానికే ట్రై చేస్తోంది. భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టులో కూడా చివరి ఇన్నింగ్సులో 371 రన్స్ ఛేజ్ చేసింది. అలాంటి సమయంలో ఇలా చిన్న బౌండరీలు ఉంటే.. ఎంత ఉపయోగపడుతుందో అర్థం చేసుకోవాలి. పేస్ బౌలింగ్‌లో ఎడ్జ్ తీసుకున్న బంతులు కూడా సిక్సర్లు పోతాయి. భారత్ బ్యాటింగ్ చేసే సమయంలో కూడా ఎడ్జ్ తీసుకున్న బంతులు సిక్సర్లు పోవడం కనిపించింది. ఇదంతా తమ ‘బాజ్ బాల్’ కోసం చేసుకున్న ఇంగ్లండ్.. భారత్‌లో స్పిన్ వికెట్లు తయారు చేస్తే మాత్రం క్రికెట్ చచ్చిపోతుందంటూ నీతులు చెప్తుంది. కలికాలం అంటే ఇది కాదా మరి?






