ENG VS WI : చెలరేగిన బట్లర్, డాసన్.. తొలి టీ20 ఇంగ్లాండ్‌దే

by Harish |

వెస్టిండీస్‌పై వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌‌పై కన్నేసింది.

ENG VS WI : చెలరేగిన బట్లర్, డాసన్.. తొలి టీ20 ఇంగ్లాండ్‌దే
X

దిశ, స్పోర్ట్స్ : వెస్టిండీస్‌పై వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌‌పై కన్నేసింది. తొలి టీ20లో నెగ్గి ఆ దిశగా అడుగేసింది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన తొలి టీ20లో ఇంగ్లాండ్ 21 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. జోస్ బట్లర్(96) బ్యాటుతో రెచ్చిపోగా.. లియామ్ డాసన్(4/20) బంతితో విజృంభించడంతో ఇంగ్లాండ్ అలవోకగా విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 రన్స్ చేసింది.

బట్లర్ 59 బంతుల్లో 96 రన్స్ చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మిగతా వారు పెద్దగా ఆకట్టుకోకపోగా బట్లర్ మెరుపులతో ఇంగ్లాండ్.. విండీస్ ముందు 189 పరుగుల లక్ష్యం పెట్టింది. ఇక, ఛేదనలో విండీస్ 167/9 స్కోరుకే పరిమితమైంది. ఎవిన్ లెవిస్(39) పర్వాలేదనిపించగా.. మిగతా వారు నిరాశపరిచారు. లియామ్ డాసన్ నాలుగు వికెట్లు తీసి కరేబియన్ జట్టు పతనాన్ని శాసించాడు. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆదివారం రెండో టీ20 జరగనుంది

Next Story