- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రియురాలితో ఇంగ్లాండ్ క్రికెటర్ సామ్ కరన్ ఎంగేజ్మెంట్
ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ సామ్ కరన్ తన ప్రేయసి ఇసాబెల్లా గ్రేస్ సైమండ్స్–విల్ల్మాట్‌తో అధికారికంగా నిశ్చితార్థం చేసుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ సామ్ కరన్ తన ప్రేయసి ఇసాబెల్లా గ్రేస్ సైమండ్స్–విల్ల్మాట్‌తో అధికారికంగా నిశ్చితార్థం చేసుకున్నారు. వారి ఎంగేజ్మెంట్ కు సంబంధించి సోషల్ మీడియాలో ఈ జంట పంచుకున్న ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట చివరకు తమ బంధాన్ని మరో మెట్టు తీసుకెళ్లారు. 2018 లో పరిచయం అయిన వీరి ప్రేమ కథ అప్పటి నుంచే బలపడ్డట్లు ఆమెకు దగ్గరగా ఉన్న వారు చెబుతున్నారు. 1998లో ఇంగ్లండ్‌లో జన్మించిన ఇసాబెల్లా, ప్రస్తుతం లండన్‌లో స్థిరపడింది. గత కొన్నేళ్లుగా సామ్ మ్యాచ్‌లకు తరచూ హాజరవుతూ, అతనికి అత్యంత పెద్ద మద్దతుదారుగా నిలిచింది. ఇప్పుడు నిశ్చితార్థం అనంతరం త్వరలోనే పెళ్లి తేదీ ప్రకటించే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ శుభవార్తతో క్రికెట్ అభిమానులు, సెలబ్రిటీలు ఇద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.






