- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒక్కరోజులో 536 పరుగులు కొట్టలేమని తేల్చేసిన ఇంగ్లాండ్ !
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం రెండో టెస్ట్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రెండో టెస్ట్ 5వ రోజు మాత్రమే

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం రెండో టెస్ట్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రెండో టెస్ట్ 5వ రోజు మాత్రమే మిగిలి ఉంది. ఇవాళ 536 పరుగులు చేస్తే ఇంగ్లాండ్ విజయం సాధిస్తుంది. లేదా ఇంగ్లాండుకు సంబంధించిన ఏడు వికెట్లు టీమిండియా తీస్తే కచ్చితంగా గిల్ సేన గ్రాండ్ విక్టరీ కొడుతుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో ఇంగ్లాండ్ అసిస్టెంట్ కోచ్ మార్కస్ ట్రెస్కోథిక్ (Marcus Trescothick) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఒక రోజులో 536 పరుగులు చేయలేమని వెల్లడించారు. రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా సంధించిన భారీ లక్ష్యాన్ని చేదించడం చాలా కష్టమని వివరించారు. పిచ్ తీరును బట్టి తమ బ్యాటర్లు ముందుకు సాగుతారని పేర్కొన్నారు. ఈ విషయంలో తామేమీ పిచ్చోళ్లం కాదని.. గెలుపు కాకపోతే డ్రా కోసం ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు ఇంగ్లాండు అసిస్టెంట్ కోచ్ మార్కస్.
అయితే ఒక్కరోజులో 500 కు పైగా పరుగులు చేయడం అసాధ్యమన్నారు. కానీ మా బ్యాటర్లు మాత్రం పోరాటం చేస్తూనే ఉంటారని గుర్తు చేశారు. ఇది ఇలా ఉండగా ఇవాళ మ్యాచ్ ప్రారంభాని కంటే ముందు వర్షం ప్రారంభమైంది. లంచ్ తర్వాత మ్యాచ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు. ఒకవేళ వర్షం ఇలాగే అంతరాయం సృష్టిస్తే మ్యాచ్ డ్రా కావడం గ్యారెంటీ అంటున్నారు క్రీడా విశ్లేషకులు.






