- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, స్పోర్ట్స్ : వెస్టిండీస్‌పై వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌ను కూడా వైట్‌వాష్ చేసింది. వరుసగా మూడో టీ20లోనూ కరేబియన్ జట్టును చిత్తు చేసి 3-0తో సిరీస్ సొంతం చేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి 248 రన్స్ చేసింది. ఓపెనర్లలో డక్కెట్ రెచ్చిపోయాడు. 46 బంతుల్లో 84 పరుగులు చేశాడు.
మరో ఓపెనర్ జేమీ స్మిత్ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 26 బంతుల్లో 60 రన్స్ చేశాడు. ఆ తర్వాత జాకబ్ బెథెల్(36 నాటౌట్), కెప్టెన్ హ్యారీ బ్రూక్(35 నాటౌట్), బట్లర్(22) కూడా ధాటిగా ఆడారు. ఇక, 249 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో విండీస్ పోరాడినా ఫలితం దక్కలేదు. 8 వికెట్లు కోల్పోయి 211 పరుగులే చేసింది. కరేబియన్ జట్టులో రొవ్‌మెన్ పొవెల్(79 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. అతని తర్వాత కెప్టెన్ షాయ్ హోప్(45) రాణించగా.. మిగతా వారు తేలిపోవడంతో వెస్టిండీస్‌కు ఓటమి తప్పలేదు. ఇంగ్లాండ్ బౌలర్లలో ల్యూక్ వుడ్ 3 వికెట్లు, ఆదిల్ రషీద్ 2 వికెట్లతో రాణించి ప్రత్యర్థిని నిలువరించారు.






