- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్‌తో 5 టీ20లు ఆడే ఇంగ్లండ్ అమ్మాయిల టీం ఇదే..!
భారత్‌తో 5 టీ20లు ఆడే ఇంగ్లండ్ అమ్మాయిల టీం ప్రకటించిన ఈసీబీ. జూన్ 28 నుంచి జులై 12 వరకు ఐదు మ్యాచులు.

దిశ, స్పోర్ట్స్: భారత్‌తో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్ మహిళల జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. జూన్ 28 నుంచి జులై 12 వరకు ఈ సిరీస్ జరగనుంది. మొత్తం 14 మందితో ప్రకటించిన ఈ జట్టులో సోఫీ ఎక్సెల్టన్ రీఎంట్రీ ఇవ్వడం గమనార్హం. ఈ ఐదు టీ20ల్లో మొదటి మ్యాచ్ జూన్ 28న ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరగనుంది. బ్రిస్టల్‌లోని సీట్ యూనిక్ స్టేడియంలో జులై 1న రెండో మ్యాచ్, కియా ఓవల్‌లో జులై 4న మూడోది, ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జులై 9న నాలుగోది, ఎడ్జ్‌బాస్టన్‌లో జులై 12న ఐదో మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ తర్వాత మూడు వన్డేల సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్ షెడ్యూల్ ఇంకా ప్రకటించలేదు.
ఇంగ్లండ్ జట్టు: నాట్ సివర్ బ్రంట్ (కెప్టెన్), టామీ బ్యూమోంట్, ఎమ్ ఆర్లట్, అలైస్ క్యాప్సీ, లారెన్ బెల్, సోఫియా డంక్లీ, చార్లీ డీన్, లారెన్ ఫైలర్, సోఫీ ఎక్సెల్టన్, పేజ్ షోల్‌ఫీల్డ్, అమీ జోన్స్, ఇస్సీ వాంగ్, లిన్సే స్మిత్, డానీ వ్యాట్ హాడ్జ్.






