- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంచలన నిర్ణయం తీసుకున్న ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్
ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు సోమవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు మీడియా వేదికగా వెల్లడించాడు. ‘సమయం వచ్చింది. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నా. ఇంగ్లాండ్‌కు ఆడాలనే నా చిన్ననాటి కల. దాన్ని నెరవేర్చుకున్నందుకు సంతోషంగా ఉంది. నాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు.’అని తెలిపాడు. కౌంటీ క్రికెట్‌లో ఆడటం కొనసాగిస్తానని, మరిన్ని ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌లు ఆడేందుకు ఎదురుచూస్తున్నానని చెప్పాడు.
వోక్స్ ఇటీవల భారత్‌తో టెస్టు సిరీస్ ఆడాడు. ఐదో టెస్టులో గాయపడిన అతను గాయంతోనే బ్యాటింగ్‌కు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆస్ట్రేలియాతో జరగబోయే యాసెస్ సిరీస్‌కు అతన్ని ఎంపిక చేయలేదు. దీంతో వోక్స్ తీవ్ర అసంతృప్తికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, గాయాలు కూడా మరో కారణం కావొచ్చు. 2011లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన వోక్స్ ఇంగ్లాండ్‌ను ఎన్నో మ్యాచ్‌ల్లో గెలిపించాడు. వన్డే వరల్డ్ కప్-2019, టీ20 వరల్డ్ కప్-2022 గెలిచిన ఇంగ్లాండ్ జట్టులో సభ్యుడు. 14 ఏళ్ల కెరీర్‌లో 62 టెస్టులు, 122 వన్డేలు, 33 టీ20లు ఆడిన ఈ ఆల్‌రౌండర్ 396 వికెట్లు తీయడంతోపాటు 3,706 రన్స్ చేశాడు.






