- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్‌కు షాక్.. రెండో వన్డేలో ఇంగ్లాండ్ మహిళల జట్టు విజయం
మరో వన్డే మిగిలి ఉండగానే వన్డే సిరీస్ కైవసం చేసుకోవాలని చూసిన భారత మహిళల క్రికెట్ జట్టుకు నిరాశ.

దిశ, స్పోర్ట్స్ : మరో వన్డే మిగిలి ఉండగానే వన్డే సిరీస్ కైవసం చేసుకోవాలని చూసిన భారత మహిళల క్రికెట్ జట్టుకు నిరాశ. రెండో వన్డేలో ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ జట్టు విజయం సాధించింది. లండన్‌లోని లార్డ్స్ స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌కు వర్షం తీవ్ర అంతరాయం కలిగింది. టాస్‌కు ముందే భారీ వర్షం పడటంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. రెండు ఇన్నింగ్స్‌లను 29 ఓవర్లకు కుదించి ఆట ప్రారంభించారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ తీవ్రంగా తడబడింది. స్మృతి మంధాన(42), దీప్తి శర్మ(30) మాత్రమే చెప్పుకోదగ్గ రన్స్ చేశారు. మిగతా వారు దారుణంగా నిరాశపరిచారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(7), రోడ్రిగ్స్(3), రిచా ఘోష(2) వంటి స్టార్లు విఫలమయ్యారు. దీంతో 29 ఓవర్లలో భారత్ అతికష్టం మీద 143/8 స్కోరు చేయగలిగింది. ఇంగ్లాండ్ బౌలర్లలో స్పిన్నర్ ఎక్లోస్టోన్ 3 వికెట్లు, ఎమ్ అర్లోట్, లెన్సీ స్మిత్ చెరో 2 వికెట్లతో సత్తాచాటారు.
144 పరుగుల లక్ష్యం చిన్నదే కావడంతో ఇంగ్లాండ్ ఛేదనలో ఎలాంటి ఒత్తిడికి గురవ్వలేదు. ఓపెనర్ అమీ జోన్స్(46 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడింది. మరో ఓపెనర్ బ్యూమౌంట్(34)తో కలిసి మొదటి వికెట్‌కు 54 రన్స్ జోడించి ఇంగ్లాండ్‌కు శుభారంభం అందించింది. ఆ తర్వాత కెప్టెన్ నాట్ స్కివర్ బ్రంట్(21)తో కలిసి జట్టును విజయం దిశగా నడిపించింది. ఇంగ్లాండ్ గెలుపునకు చేరువైన సమయంలో వరుణుడు మరోసారి అడ్డు తగిలాడు. కానీ, త్వరగానే శాంతించాడు. అయితే, ఓవర్లు నష్టపోవాల్సి వచ్చింది. డీఎల్‌ఎస్ పద్ధతిలో రెండో ఇన్నింగ్స్ 24 ఓవర్లకు కుదించి లక్ష్యాన్ని 115గా నిర్దేశించారు. అప్పటికే ఇంగ్లాండ్ ఇంకా 5.2 ఓవర్లలో 13 రన్స్ చేయాలి. తిరిగి ఆట ప్రారంభమవ్వగా నాట్ స్కివర్ బ్రంట్ అవుటైనా అమీ జోన్స్ జట్టును విజయతీరాలకు చేర్చింది. దీంతో ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇక, నిర్ణయాత్మక మూడో వన్డే మంగళవారం జరగనుంది.
- Tags
- ENG-W vs IND-W






