- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Women's World Cup 2025 : రెచ్చిపోయిన వొల్వార్ట్, కాప్.. ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకెళ్లిన సౌతాఫ్రికా
మహిళల వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా జట్టు ఫైనల్‌లో అడుగుపెట్టింది.

దిశ,స్పోర్ట్స్ : మహిళల వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా జట్టు ఫైనల్‌లో అడుగుపెట్టింది. సెమీస్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తు చేస్తూ టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. పురుషుల, మహిళల ఏ విభాగంలోనైనా సౌతాఫ్రికా వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి. గువహతి వేదికగా బుధవారం జరిగిన సెమీస్‌లో సౌతాఫ్రికా 125 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై భారీ విజయం నమోదు చేసింది. ముందుగా సౌతాఫ్రికా బ్యాటింగ్ చేయగా.. కెప్టెన్ లారా వోల్వార్ట్ భారీ శతకంతో రెచ్చిపోయింది. మ్యాచ్‌కే ఆమె ఆట హైలెట్. 143 బంతుల్లో 169 పరుగులు చేసింది. ఆమె తర్వాత బ్రెట్స్(45), మారిజన్నె కాప్(42), ట్రయోన్(33 నాటౌట్) పర్వాలేదనిపించారు. వొల్వార్ట్ విధ్వంసంతో దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 319 పరుగుల భారీ స్కోరు చేసింది.
అనంతరం ఛేదనలో ఇంగ్లాండ్ కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. 42.3 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ స్కివర్ బ్రంట్(64), ఎలైస్ క్యాప్సీ(50) పోరాడినా మిగతా వారు విఫలమవడంతో ఇంగ్లాండ్ టైటిల్ ఆశలు గల్లంతయ్యాయి. సౌతాఫ్రికా బౌలర్ మారిజన్నె కాప్ 5 వికెట్లుతో విజృంభించి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించింది. నేడు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే సెమీస్‌లో గెలిచిన జట్టుతో సౌతాఫ్రికా టైటిల్ పోరులో తాడోపేడో తేల్చుకోనుంది.






