ENG VS NZ 3rd ODI: సిక్సర్లతో చెలరేగిన బెన్‌ స్టోక్స్‌.. డబుల్‌ సెంచరీ మిస్‌

by Vinod kumar |   (  Updated:2023-09-14 13:40:57  IST  )

లండన్‌లోని కెన్నింగ్‌స్టన్‌ ఓవల్‌ వేదికగా ఇవాళ జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్‌ స్టార్‌ ఆటగాడు బెన్‌ స్టోక్స్‌ చెలరేగాడు.

ENG VS NZ 3rd ODI: సిక్సర్లతో చెలరేగిన బెన్‌ స్టోక్స్‌.. డబుల్‌ సెంచరీ మిస్‌
X

దిశ, వెబ్‌డెస్క్: లండన్‌లోని కెన్నింగ్‌స్టన్‌ ఓవల్‌ వేదికగా కివీస్‌తో ఇవాళ జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్‌ స్టార్‌ ఆటగాడు బెన్‌ స్టోక్స్‌ చెలరేగాడు. కేవలం 124 బంతుల్లోనే 15 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 182 పరుగులు చేశాడు. వన్డే క్రికెట్‌లో ఇంగ్లండ్‌ తరఫున ఇదే అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్‌ కావడం విశేషం. 182 పరుగుల వద్ద మరో భారీ సిక్సర్‌కు ప్రయత్నించి స్టోక్స్‌ ఔటయ్యాడు. స్టోక్స్‌ ఔటయ్యాక ఆఖర్లో వికెట్లు వెనువెంటనే పడిపోవడంతో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 368 పరుగుల వద్ద ముగిసింది. 11 బంతులు వేస్ట్‌ అయ్యాయి.

ఒకవేళ స్టోక్స్‌ ఔట్‌ కాకుండా ఉండివుంటే, అతను డబుల్‌ సెంచరీ చేసేవాడు. కివీస్‌ బౌలర్2లో.. పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ ఏమాత్రం తగ్గకుండా 5 వికెట్లతో చెలరేగాడు. బెన్‌ లిస్టర్‌ ఆఖర్లో 3 వికెట్లు పడగొట్టగా.. ఫెర్గూసన్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌ తలో వికెట్‌ దక్కించుకన్నారు. కాగా, 4 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి వన్డేలో న్యూజిలాండ్‌, రెండో వన్డేలో ఇంగ్లండ్‌ గెలుపొందాయి. అంతకుముందు జరిగిన 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ 2-2తో సమంగా ముగిసింది.

Next Story