- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL 2025 : ఎలిమినేటర్ మ్యాచ్.. ముంబై భారీ స్కోర్
ఎలిమినేటర్ మ్యాచు(Eliminator Match)లో గుజరాత్ పై ముంబై 228 పరుగుల భారీ స్కోర్ చేసింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఎలిమినేటర్ మ్యాచు(Eliminator Match)లో గుజరాత్ పై ముంబై 228 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచులో నేడు ముంబై, గుజరాత్(MI vs GT) జట్లు తలపడుతున్న సంగతి తెలిసిందే. టాస్ గెలచి తొలుత బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(Rohit Sharma) 81 పరుగులతో అదరగొట్టాడు. బెయిర్ స్టో(47), సూర్య కుమార్ యాదవ్(33), తిలక్ వర్మ(25), హార్దిక్ పాండ్య(22) పరుగులతో రాణించారు. ఇక గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్, సాయి కిషోర్ తలా రెండు వికెట్లు తీయగా, సిరాజ్ ఒక వికెట్ తీశాడు. GT బౌలర్స్ పలు కీలక క్యాచ్ లు వదిలి వేయడం ముంబైకి కలిసి వచ్చింది. 229 పరుగుల లక్ష్యంతో తదుపరి ఇన్నింగ్స్ లో గుజరాత్ బరిలోకి దిగనుంది.
Next Story






