- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Flash: క్రికెటర్ మహ్మద్ షమీకి ఎన్నికల సంఘం నోటీసులు
భారత క్రికెటర్ మహ్మద్ షమీ, అతని సోదరుడు మహ్మద్ కైఫ్ కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: భారత క్రికెటర్ మహ్మద్ షమీ, అతని సోదరుడు మహ్మద్ కైఫ్ కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, ప్రముఖ నటుడు దేవ్ కు కూడా నోటీసులు ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR)లో భాగంగా ఈసీ సమన్లు జారీ చేసింది. స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్లో భాగంగా అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.
యూపీలో పుట్టి.. కోల్ కతాలో స్థిరపడిన షమీ
యూపీలోని అమ్రోహాలో పుట్టిన షమీ.. క్రికెట్ కెరీర్ కోసం చాలాకాలంగా కోల్ కతాలోనే నివసిస్తున్నాడు. ఈ క్రమంలో అతను కోల్ కతా మున్సిపల్ కార్పొరేషన్ (KMC) వార్డునంబర్ 93లో ఓటరుగా నమోదు చేసుకున్నాడు. ఇది రాష్ బెహారీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ప్రస్తుతం రాజ్ కోట్లో జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం హియరింగ్ కు హాజరుకాలేకపోయాడు. టోర్నీ ముగిసిన తర్వాత షమీ విచారణకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. జనవరి 9 నుంచి 11వ తేదీలోగా విచారణకు హాజరుకానున్నట్లు సమాచారం. కాగా.. గతంలోనూ ఈసీ పలువురికి ఇలాంటి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నటుడు అనిర్బన్ భట్టాచార్య, సెలబ్రిటీ కపుల్ కౌశిక్ బెనర్జీ, లాబోని సర్కార్ లకు కూడా ఈ నోటీసులు జారీ చేశారు. సోమవారం లాబోని సర్కార్ విచారణకు హాజరు కాగా.. తనతో కొన్ని పేపర్లపై సంతకాలు తీసుకుని పంపించారని తెలిపారు.






