ఫిఫా వరల్డ్ కప్‌లో ఈజిప్ట్ సంచలనం.. న్యూజిలాండ్‌పై అద్భుత విజయం

by Kema Shiva Kumar |

ఫిఫా ప్రపంచకప్ 2026లో ఈజిప్ట్ చారిత్రాత్మక విజయం సాధించింది.

ఫిఫా వరల్డ్ కప్‌లో ఈజిప్ట్ సంచలనం.. న్యూజిలాండ్‌పై అద్భుత విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఫిఫా ప్రపంచకప్‌-2026 (FIFA World Cup 2026)లో మరో సంచలనం నమోదైంది. కెనడాలోని వాంకోవర్ వేదికగా జరిగిన గ్రూప్-జి రౌండ్ మ్యాచ్‌లో ఈజిప్ట్ (Egypt) జట్టు 3-1 తేడాతో న్యూజిలాండ్‌ (New Zealand)పై తిరుగులేని విజయం సాధించింది. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలోనే ఈజిప్ట్ దేశానికి ఇదే మొట్టమొదటి విజయం కావడం విశేషం. స్టార్ ప్లేయర్, కెప్టెన్ మహ్మద్ సలాహ్ ఒక గోల్, ఇకే ఒక అసిస్ట్‌తో జట్టును ధైర్యంగా ముందుండి నడిపించాడు.

తొలి అర్థభాగం ఆధిక్యంలో న్యూజిలాండ్..

మ్యాచ్ ప్రారంభమైన 15వ నిమిషంలోనే న్యూజిలాండ్ ఆటగాడు ఫిన్ సుర్మాన్ (Finn Surman) అద్భుతమైన హెడర్ గోల్‌తో జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించి ఈజిప్ట్‌కు షాకిచ్చాడు. అయితే ఆ తర్వాత ఈజిప్ట్ పుంజుకుంది. 58వ నిమిషంలో మోస్తఫా జికో హెడర్ ద్వారా గోల్ చేసి స్కోరును సమం చేశాడు. ఇక 67వ నిమిషంలో ఈజిప్ట్ స్టార్ కెప్టెన్ మహ్మద్ సలాహ్ (Mohamed Salah) క్లోజ్-రేంజ్ ఫినిషింగ్‌తో కీలకమైన రెండో గోల్ చేసి జట్టును 2-1 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆట ముగిసేందుకు కేవలం 8 నిమిషాలు ఉందనగా.. 82వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ ట్రెజెగెట్ హెడర్ (Trezeguet's Header) కల్లుచెదరిగే మూడో గోల్‌ కొట్టి ఈజిప్ట్ 3-1 ఆధిక్యంలోకి తీసుకెళ్లి విజయాన్ని ఖరారు చేశాడు. తాజాగా విజయంతో ఈజిప్ట్ మొత్తం 4 పాయింట్లతో గ్రూప్-జి పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. తదుపరి మ్యాచ్‌లో ఇరాన్‌తో కనీసం డ్రా చేసుకున్నా ఈజిప్ట్ సులభంగా నాకౌట్ దశకు అర్హత సాధిస్తుంది.

Next Story