- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెరిసిన డియమాంటకోస్.. డ్యూరాండ్ కప్ సెమీస్‌కు ఈస్ట్ బెంగాల్!
డ్యూరాండ్ కప్ క్వార్టర్ ఫైనల్‌లో ఈస్ట్ బెంగాల్ స్టార్ డియమాంటకోస్ రెండు గోల్స్‌తో మెరిశాడు. మోహన్ బగన్‌ను చిత్తు చేసిన ఈబీ.. సెమీస్‌కు దూసుకెళ్లింది.

దిశ, స్పోర్ట్స్: కోల్‌కతా డెర్బీలో ఈస్ట్ బెంగాల్ 2-1 తేడాతో అదిరిపోయే విజయం సాధించింది. మోహన్ బగన్ సూపర్ జెయింట్‌తో జరిగిన డ్యూరాండ్ కప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచులో ఈస్ట్ బెంగాల్ జట్టు అదరగొట్టింది. సాల్ట్ లేక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఆరంభం నుంచే ఈస్ట్ బెంగాల్ టీం ఆధిపత్యం చెలాయించింది. అయితే 18వ నిమిషంలో ఆ టీం కీ ప్లేయర్ అహదాద్ గాయపడి మైదానం వీడాల్సి వచ్చింది.
అతని స్థానంలో వచ్చిన దిమిట్రయోస్ డియమాంటకోస్.. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. 36వ నిమిషంలో పెనాల్టీని గోల్‌గా మలిచిన డియమాంటకోస్.. ఈస్ట్ బెంగాల్‌కు ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత మోహన్ బగన్ పోరాడిన మ్యాచ్ తొలి అర్ధభాగాన్ని ఈస్ట్ బెంగాల్ 1-0 ఆధిక్యంతో ముగించింది. సెకండ్ హాఫ్‌లో 52వ నిమిషంలో మహేష్ సింగ్ కొట్టిన స్ట్రైక్‌ను డియమాంటకోస్ గోల్‌గా మలిచాడు. దీంతో ఈస్ట్ బెంగాల్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
చివర్లో 68వ నిమిషంలో మోహన్ బగన్ ప్లేయర్ అనిరుధ్ థాపా అద్భుతమైన గోల్ వేసి తన టీంను పోటీలోకి తెచ్చాడు. కానీ ఆ టీం తమకు దక్కిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయింది. అదనంగా ఆరు నిమిషాలు కేటాయించినా మోహన్ బగన్ మరో గోల్ చేయలేకపోయింది. దీంతో డ్యూరండ్ కప్ సెమీస్‌లోకి ఈస్ట్ బెంగాల్ దూసుకెళ్లింది. ఆగస్టు 20న జరిగే తదుపరి మ్యాచ్‌లో డైమండ్ హార్బర్ ఎఫ్‌సీను ఢీకొట్టనుంది.
ప్లేయర్ల మధ్య ఫైట్..
ఈ మ్యాచ్ చివర్లో క్రెస్పోను ట్యాకిల్ చేయడంతో ఇరు జట్ల మధ్య గొడవ జరిగింది. లాల్‌చుంగుంగ, పెట్రటోస్ ఇద్దరూ గొడవ పడ్డారు. ఇరు జట్ల ప్లేయర్లు కూడా ప్రత్యర్థి ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి చెయ్యిదాటేలా కనిపించిన సమయంలో రిఫరీ కల్పించుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.






