- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దులీప్ ట్రోఫీలో ఫైనల్‌కు దూసుకెళ్లిన సెంట్రల్ జోన్, సౌత్ జోన్ జట్లు
దులీప్ ట్రోఫీలో సౌత్ జోన్, సెంట్రల్ జోన్ జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి.

దిశ, స్పోర్ట్స్ : బెంగళూరు వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీలో సౌత్ జోన్, సెంట్రల్ జోన్ జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. ఆదివారం ముగిసిన సెమీస్ మ్యాచ్‌లను వెస్ట్ జోన్‌తో సెంట్రల్ జోన్, నార్త్ జోన్‌తో సౌత్ జోన్ డ్రా చేసుకున్నాయి. అయితే, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా సౌత్, సెంట్రల్ జోన్లు ఫైనల్ బెర్త్ సాధించాయి. ముందుగా సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 536 స్కోరు చేసింది. మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌కు దిగిన నార్త్ జోన్ ఓవర్ నైట్ స్కోరు 278/5తో ఆదివారం ఆట కొనసాగించి 361 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆ జట్టులో శుభమ్ ఖజురియా(128), నిశాంత్(82) రాణించారు. సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 175 పరుగుల ఆధిక్యం సాధించగా.. రెండో ఇన్నింగ్స్‌లో 95/1 స్కోరు వద్ద అంపైర్లు మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. జగదీశన్(197, 52 నాటౌట్) సౌత్ జోన్ ఫైనల్‌కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.
వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్ మ్యాచ్ విషయానికొస్తే.. ముందుగా వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 483 పరుగులు చేసింది. ఆ తర్వాత సమిష్టిగా రాణించిన సెంట్రల్ జోన్ 600 స్కోరు చేసి 162 రన్స్ లీడ్ సాధించింది. ఇక, రెండో ఇన్నింగ్స్‌లో వెస్ట్ జోన్ ఆట ముగిసే సమయానికి 216/8 స్కోరు చేయగా.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా సెంట్రల్ జోన్ ఫైనల్‌కు వెళ్లింది. ఈ నెల 11-15 మధ్య సౌత్, సెంట్రల్ జోన్ల మధ్య ఫైనల్ జరగనుంది.






