ధోని అవుట్ అవ్వడం వల్లే.. వరల్డ్ కప్‌లో ఫైనల్‌కు చేరుకున్నాం: ఫెర్గూసన్

by Malleboina Mahesh |   (  Updated:2023-09-11 16:38:11  IST  )

2019 వరల్డ్ కప్‌ సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. కివీస్ బౌలర్ ఫెర్గూసన్ వేసిన 49వ ఓవర్‌లో ఎంఎస్ ధోనీ రనౌట్ అవడంతో టీమ్ ఇండియా విజయానికి దూరమైంది.

ధోని అవుట్ అవ్వడం వల్లే.. వరల్డ్ కప్‌లో ఫైనల్‌కు చేరుకున్నాం: ఫెర్గూసన్
X

న్యూఢిల్లీ : 2019 వరల్డ్ కప్‌ సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. కివీస్ బౌలర్ ఫెర్గూసన్ వేసిన 49వ ఓవర్‌లో ఎంఎస్ ధోనీ రనౌట్ అవడంతో టీమ్ ఇండియా విజయానికి దూరమైంది. ఇప్పటికీ ధోనీ రనౌట్ ఫోటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా ఆ మ్యాచ్‌పై ఫెర్గూసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీ అవుటవ్వడం వల్లే తాము ఫైనల్‌కు చేరుకున్నామని తెలిపాడు. అలాగే, ధోని ఫినిషింగ్ సామర్థ్యాలను ప్రశంసించాడు. ధోనీ కుదురుకుంటే అతన్ని ఆపడం కష్టమని, ధోనీ రనౌట్ అవడంతో తాము సునాయాసంగా గెలిచామని చెప్పాడు. కాగా, ఆ మ్యాచ్‌లో 49వ ఓవర్‌లో రెండో పరుగుకు యత్నించిన ధోనీ.. గఫ్టిల్ డైరెక్ట్ త్రోతో రనౌట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే.

Next Story