టీమిండియాకు షాక్‌..సిరాజ్ చేతికి తీవ్ర గాయం

by velandi.Saikiran |   (  Updated:2025-11-09 21:30:38  IST  )

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ( Siraj ) చేతికి తీవ్ర గాయం అయింది. బంతిని ఆపబోయి వేలికి గాయం చేసు

టీమిండియాకు షాక్‌..సిరాజ్ చేతికి తీవ్ర గాయం
X

దిశ‌, వెబ్ డెస్క్: టీమిండియా జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ వేలికి తీవ్రమైన గాయం జరిగింది. టీమిండియా A వర్సెస్ దక్షిణాఫ్రికా A జట్ల మధ్య నామమాత్రపు రెండో టెస్టు జరిగిన సంగతి తెలిసిందే. ఈ టెస్టులో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ( Siraj ) చేతికి తీవ్ర గాయం అయింది. బంతిని ఆపబోయి వేలికి గాయం చేసుకున్నాడు మహమ్మద్ సిరాజ్.

ఆ గాయం కారణంగా కాస్త రక్తస్రావం కూడా అయినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే గ్రౌండ్ నుంచి అతన్ని డ్రెస్సింగ్ రూమ్ కు తీసుకువెళ్లారు. గాయం తీవ్రతరం అయితే రెండు రోజుల పాటు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందట. ఇది ఇలా ఉండగా సౌత్ ఆఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య నవంబర్ 14వ తేదీ నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ రెండు జ‌ట్ల మధ్య రెండు టెస్టులు, మూడు వ‌న్డేలు అలాగే 5 టీ20లు జరగనున్నాయి. నవంబ‌ర్‌ 14వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ సాగుతుంది.

Next Story