Champions Trophy 2025 : ఛాంపియన్స్ ట్రోఫీపై వీడని సందిగ్ధం

by M.Rajitha |
Champions Trophy 2025 : ఛాంపియన్స్ ట్రోఫీపై వీడని సందిగ్ధం
X

దిశ, వెబ్ డెస్క్ : ఛాంపియన్స్ ట్రోఫీ 2025(Champions Trophy 2025) నిర్వహణపై సందిగ్ధం వీడలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ఐసీసీ(ICC) సమావేశాలు జరుపుతోంది. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్(Pakisthan) వేదికగా జరగనుండగా.. టీంఇండియాకు సంబంధించిన మ్యాచ్ లు పాక్ అవతల జరపాలని బీసీసీఐ(BCCI) ఐసీసీకి, పాక్ బోర్డు(PCB)కు తెలిపిందే. అయితే ఈ హైబ్రిడ్ విధానానికి పాక్ ససేమీరా అంటోంది.ఈ విషయం మీద ఓ వైపు ఐసీసీ ఈ సమావేశాలు జరుపుతుండగానే.. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ పాక్ వెళ్ళేది లేదని భారత విదేశాంగశాఖ తేల్చి చెప్పింది. భద్రతాపరమైన కారణాల వలన భారత జట్టును పాకిస్థాన్ కు పంపించడం కుదరదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ ధీర్ జైస్వాల్ ప్రకటించారు. మరోవైపు భారత జట్టు లేకపోయినా ట్రోఫీ నిర్వహించి తీరతామని పాక్ బోర్డ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఐసీసీ సమావేశం రేపటికి వాయిదా పడింది.

Advertisement

Next Story

Most Viewed