- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL 2025: నేడు డబుల్ డెక్కర్ మ్యాచులు.. హాట్రిక్ వేటలో ఢిల్లీ, పంజాబ్
ఐపీఎల్ 2025 లో భాగంగా నేడు శనివారం కావడంతో డబుల్ డెక్కర్ మ్యాచులు జరగనున్నాయి. ఈ 18వ సీజన్ లో ఎవరూ ఊహించని విధంగా చిన్న జట్లు భారీ విజయాలను అందుకొని టాప్ పొజిషన్‌లో కొనసాగుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 లో భాగంగా నేడు శనివారం కావడంతో డబుల్ డెక్కర్ మ్యాచులు (Double Decker Matches) జరగనున్నాయి. ఈ 18వ సీజన్ లో ఎవరూ ఊహించని విధంగా చిన్న జట్లు భారీ విజయాలను అందుకొని టాప్ పొజిషన్‌లో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నేడు జరిగే రెండు మ్యాచుల్లో.. కుర్ర జట్లు, సీనియర్ జట్లతో పోటీ పడుతున్నాయి. నేడు డబుల్ డెక్కర్ మ్యాచ్‌లలో భాగంగా మొదటి మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు చెన్నైలోని చపాక్ స్టేడియం (Chhapaak Stadium)లో జరగనుంది. ఢిల్లీ కెప్టెన్ గా యువ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel) వ్యవహరిస్తున్నాడు. అలాగే చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో భాద పడుతుండటంతో ధోని (Dhoni) కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే రెండో మ్యాచులో పంజాబ్ కింగ్స్ (Punjab Kings), రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) తలపడనున్నాయి. ఈ 18వ మ్యాచ్ చండీఘర్ లోని మహరాజా యదవింద్ర సింగ్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇందులో పంజాబ్ జట్టుకు శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) నాయకత్వం వహిస్తుండగా.. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సంజూ శాంసన్ (Sanju Samson) కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇదిలా ఉంటే యువ ప్లేయర్ లతో నిండిపోయిన ఢిల్లీ, పంజాబ్ జట్లు ఈ సీజన్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో భారీ విజయాలను అందుకున్నాయి. దీంతో నేడు జరిగే మ్యాచుల్లో ఈ జట్లు హ్యాట్రిక్ విజయాలను (Hat-trick wins) అందుకోవాలని చూస్తున్నాయి. మరీ యువ జట్లు నేటి మ్యాచ్‌లలో హాట్రిక్ విజయాలను అందుకుంటాయో లేదో తెలియాలంటే పూర్తి మ్యాచులు చూడాల్సిందే మరి.






