- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోచ్ లపై అతిగా ఆధారపడొద్దు.. టీమిండియా స్టార్ స్పిన్నర్ అశ్విన్
కోచ్ లపై అతిగా ఆధారపడితే.. సొంతంగా పరిష్కారాలను కనుగొనలేమని, టీమిండియా స్టార్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్ డెస్క్: కోచ్ లపై అతిగా ఆధారపడితే.. సొంతంగా పరిష్కారాలను కనుగొనలేమని, టీమిండియా స్టార్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అశ్విన్ మాట్లాడుతూ.. " చాలా మంది ఆటగాళ్లు.. కోచ్ లు, మెంటార్ ల పైనే ఎక్కువగా ఆధారపడతారు. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి అని అన్నారు. కోచ్ లపై ఎక్కువగా ఆధారపడటం వల్ల మనలో కొత్త ఆలోచనలు ఆవిష్కృతం కావు. అందువల్ల ఏ విషయాన్ని కూడా మనం సొంతంగా పరిష్కరించుకోలేము. ఆటగాళ్లకు ఒక కోచ్.. వాళ్లకు ఎదురయ్యే అనేక సవాళ్లకు పరిష్కారం చూపించొచ్చు. కానీ అదే అందరికీ పని చేస్తుందని అస్సలు అనుకోవద్దు" అని అశ్విన్ అన్నారు.
Next Story






