వివాదాలు సృష్టించడంపై ఫోకస్ పెట్టొద్దు.. క్రికెట్ కామెంట్రీపై హిట్‌మ్యాన్ హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-08 07:54:05  IST  )

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్ట్ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.

వివాదాలు సృష్టించడంపై ఫోకస్ పెట్టొద్దు.. క్రికెట్ కామెంట్రీపై హిట్‌మ్యాన్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్ట్ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఈ మేరకు బుధవారం ఆయన సింపుల్‌గా ఇన్‌స్టాగ్రామ్ (Instagram) స్టోరీలో తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ‘అందరికీ నమస్కారం.. నేను టెస్ట్‌ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నా. సుదీర్ఘ ఫార్మాట్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడాన్ని గౌరవంగా భావిస్తున్నా. ఈ ప్రయాణంలో నాపై చూపించిన ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు.. ఇక వన్డే ఫార్మాట్‌లో కొనసాగుతా’ అంటూ రోహిత్ ఆ స్టోరీలో పేర్కొన్నారు.

అయితే, ఓవైపు ఐపీఎల్ (IPL) కొనసాగుతోన్న వేళ ఆకస్మాత్తుగా రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురవుతున్నారు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ భారత్‌లో క్రికెట్ కామెంట్రీ (Cricket Commentary)పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కామెంటేటర్లు ఆటలో వివాదాలు సృష్టించడంపై ఫోకస్ పెట్టొద్దని సూచించాడు. కామెంట్రీతో పాటు క్రికెట్ జర్నలిజం (Cricket Journalism) ఆటగాళ్ల పట్ల వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం బాగోలేదని ఫైర్ అయ్యారు. ఏదైనా ఉన్నది ఉన్నట్లుగానే రాయాలని.. మసాలాలు జోడించొద్దని జర్నలిస్టులకు హితవు పలికాడు. ప్లేయర్ వ్యక్తిగత విషయాలపై చర్చ పెట్టే బదులు వారు ఆడే ఆట నైపుణ్యంపై పెడితే బాగుంటుందని రోహిత్ శర్మ అన్నాడు. ప్రస్తుతం హిట్‌మ్యాన్ చేసిన వ్యాఖ్యలు ఇంటర్‌నేషనల్ క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

Next Story