ముద్రగడ పద్మనాభంకు అస్వస్థత... హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స

by Vemula.Srinu Prasad |

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను హైదరాబాద్ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సకు తరలించారు...

ముద్రగడ పద్మనాభంకు అస్వస్థత... హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స
X

దిశ, వెబ్ డెస్క్: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం(Kapu movement leader Mudragada Padmanabham) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను హైదరాబాద్ ప్రైవేటు ఆస్పత్రి(Hyderabad Private Hospital)లో చికిత్స(Treatment)కు తరలించారు. ఈ మేరకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కొన్ని రోజులుగా ముద్రగడ కిడ్నీ సంబంధిత వ్యాధి(Kidney Disease)తో బాధపడుతున్నారు. రెండు రోజులుగా ఆయనకు డయాలసిస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు అధికారికంగా ప్రకటించారు.

ముద్రగడ ఆరోగ్యంపై జగన్ ఆరా

మరోవైపు ముద్రగడ ఆరోగ్యంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy) ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని సూచించారు. అయితే ముద్రగడ ఆరోగ్యంపై కొందరు కాపుల్లో ఆందోళన నెలకొంది. దీంతో కుటుంబ సభ్యులు స్పందించారు. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని తెలిపారు. ముద్రగడ పద్మనాభం ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేశారు.

Next Story