- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాయికృష్ణ ఘటనపై భగ్గుమన్న వైసీపీ నేతలు.. తిరుపతిలో భారీ ర్యాలీ
రౌడీ షీటర్ సాయికృష్ణ మిస్సింగ్ మిస్టరీపై తిరుపతి వైసీపీ నేతలు భగ్గుమన్నారు. సాయికృష్ణ తల్లికి మద్దతు తెలుపుతూ తిరుపతిలో ఒక్కసారిగా నిరసనకు దిగారు. ...

దిశ, వెబ్ డెస్క్: రౌడీ షీటర్ సాయికృష్ణ మిస్సింగ్ మిస్టరీ(Sai Krishna Missing Mystery)పై తిరుపతి వైసీపీ నేతలు(Tirupati Ycp Leders) భగ్గుమన్నారు. సాయికృష్ణ తల్లికి మద్దతు తెలుపుతూ తిరుపతిలో ఒక్కసారిగా నిరసనకు దిగారు. అనంత వీధి నుంచి గాంధీ రోడ్ పూలమఠం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. సాయికృష్ణను విజయవాడ కృష్ణలంక పోలీసులు లాక్ డెత్ చేశారని, సీబీఐతో విచారణ జరిపించాలని నినాదాలు చేశారు. కృష్ణలంక పీఎస్‌లో జరుగుతున్న దారుణాలకు సీఐ నాగరాజు ఒకరే బాధ్యుడు కాడని, వెనుక ఉండి నడిపించిన ప్రతి ఒక్కరికి శిక్షపడాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో ఒక దళిత మహిళ తల్లి లాకప్ డెత్ ఘటన తరువాత ఇలాంటి ఘటనలు ఎన్నో చోట్ల జరిగాయని వైసీపీ మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి(TTD Former Chairman Bhumana Karunakar Reddy) గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఏ విధంగా ఉన్నాయో ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుస్తోందని ఆయన మండిపడ్డారు. సాయికృష్ణ ఉదంతానికి బాధ్యత వహిస్తూ హోంమంత్రి అనిత తన పదవికి రాజీనామా చేయాలని భూమన డిమాండ్ చేశారు.






