- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Neeraj Chopra : దోహా విజయం నాలో మరింత ఆత్మవిశ్వాసం పెంచింది : నీరజ్ చోప్రా
దోహా డైమండ్ లీగ్(Doha Diamond League) విజయం తనలో మరింత ఆత్మవిశ్వాసం పెంచిందని భారత జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా(Javelin Thrower Neeraj Chopra) సంతోషం వ్యక్తం చేశాడు.

దిశ, వెబ్ డెస్క్ : దోహా డైమండ్ లీగ్(Doha Diamond League) విజయం తనలో మరింత ఆత్మవిశ్వాసం పెంచిందని భారత జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా(Javelin Thrower Neeraj Chopra) సంతోషం వ్యక్తం చేశాడు. ఈ విజయం తన కెరీర్‌లో కేవలం ప్రారంభమని, రాబోయే వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో మరింత దూరం తన జావెలిన్ విసరగలనని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. తనకు మద్దతు తెలిపిన అభిమానులు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపాడు. తన కొత్త కోచ్ జాన్ జెలెజ్నీ, ఫిజియో ఇషాన్ మర్వాహా సహకారంతో ఈ మైలురాయిని సాధించినట్లు నీరజ్ పేర్కొన్నాడు.
మే 16న ఖతార్‌లోని దోహా డైమండ్ లీగ్‌లో తొలిసారిగా 90 మీటర్ల మార్కును అధిగమించి నీరజ్ చరిత్ర సృష్టించాడు. అయితే జర్మనీ ఆటగాడు జూలియన్ వెబర్ 91.06 మీటర్లతో మొదటి స్థానం సాధించగా నీరజ్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ విజయంతో నీరజ్ ఆసియాలో 90 మీటర్లు దాటిన మూడో ఆటగాడిగా, ప్రపంచంలో 25వ ఆటగాడిగా నిలిచాడు.






