Dog robot in IPL: ఐపీఎల్‌లో డాగ్ రోబో సందడి.. ధోని ఏం చేశాడో చూడండి!

by D.Reddy |
Dog robot in IPL: ఐపీఎల్‌లో డాగ్ రోబో సందడి.. ధోని ఏం చేశాడో చూడండి!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 18వ సీజన్ ఉత్కంఠగా సాగుతోంది. 2008లో ప్రారంభమైన ఈ మెగా లీగ్‌.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త రూల్స్‌తో పాటు ఆధునాతన టెక్నాలజీని ఉపయోగించుకుంటూ అభిమానులను మరింత చేరువవుతోంది. ఈ క్రమంలో తాజాగా బీసీసీఐ (BCCI) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో రూపొందించిన డాగ్ రోబోను ప్రవేశపెట్టింది. బ్రాడ్‌కాస్టింగ్‌ టీమ్‌లో చేరిన ఈ డాగ్ రోబోను ప్రముఖ కామెంటేటర్‌ డానీ మారిసన్‌ ప్రేక్షకులకు పరిచయం చేశాడు.

అరుణ్ జెట్లీ స్టేడియంలో ఆదివారం (ఏప్రిల్ 13) ముంబై, ఢిల్లీ జట్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఈ రోబో సందడి చేసింది. క్రికెటర్లకు ఓ స్నేహితుడిలా షేక్ హ్యాండ్ ఇస్తుంది. వాళ్లు చెప్పిన విష‌యాల్ని అర్థం చేసుకొని స‌మాధానాలు ఇస్తుంది. వేగంగా న‌డవ‌డం, ప‌రుగెత్త‌డంతో పాటు జంప్ చేయటం వంటి ఫీట్లు చేసి అందరినీ అలరించింది. ఇక దీనిలో అమ‌ర్చిన GoPro యాక్ష‌న్ కెమెరాతో చ‌క‌చ‌కా ఫొటోలు తీస్తూ.. క్రికెట‌ర్ల‌కు ఎలాంటి ఆప‌ద తలెత్త‌కుండా గ‌స్తీ కాస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్‌ అయ్యాయి.

ఇక మంగళవారం లక్నో-చెన్నై మ్యాచ్‌లో ఈ ఐపీఎల్ డాగ్ అభిమానులను అలరించింది. ఈ మ్యాచ్‌కు ముందు చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) హాయ్ చెప్పినట్లే చెప్పి.. పక్కకు పడుకోబెట్టి పరుగెత్తాడు. దీంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారు. ఈ మ్యాచ్ అనంతరం ధోనీకి అడ్డంగా ఈ రోబోట్ డాగ్ వెళ్లగా అతను దాన్ని సంకలో పెట్టుకొని ఎత్తుకెళ్లాడు. ప్ర‌స్తుతం ఆ వీడియో నెట్టింట వైర‌ల‌వుతోంది.



Next Story

Most Viewed