IPL 2025 : ధోనీకి బ్రెయిన్ పనిచేస్తుందా? : గిల్ క్రిస్ట్ సంచలన వ్యాఖ్యలు

by Muthe.Rajitha |   (  Updated:2025-05-04 17:18:37  IST  )

ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో చెన్నై జట్టు అత్యంత పేలవ ప్రదర్శన చేస్తున్న సంగతి తెలిసిందే.

IPL 2025 : ధోనీకి బ్రెయిన్ పనిచేస్తుందా? : గిల్ క్రిస్ట్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో చెన్నై జట్టు అత్యంత పేలవ ప్రదర్శన చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా శనివారం జరిగిన ఆర్సీబీ వర్సెస్ సీఎస్కే(RCB vs CSK) మ్యాచ్ లోనూ అదే చెత్త ప్రదర్శన కొనసాగించడంతో ఘోర ఓటమి పాలైంది. కాగా ఆ జట్టు కెప్టెన్ ధోనీ(MS Dhoni) తీసుకున్న నిర్ణయాలే మ్యాచ్ ఓడిపోవడానికి కారణం అని క్రీడా నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గిల్ క్రిస్ట్(Gill Christ) మరింత ముందుకు వెళ్ళి అసలు ధోనీకి బ్రెయిన్ పనిచేస్తుందా అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. సీఎస్కే జట్టు బౌలర్ ఖలీల్ అప్పటికే 32 పరుగులు ఇచ్చినప్పటికీ.. చివరి ఓవర్ మళ్ళీ అతనికే ఎందుకు ఇచ్చాడో అర్థం కాలేదని అన్నాడు. ధోనీలో మునుపటి పదునైన ఆలోచనా శక్తి మిగిలి ఉందో లేదో అనే సందేహం వస్తోందని తెలిపాడు.

రిటైర్మెంట్ కు దగ్గర పడుతున్న కొద్దీ ధోనీ బ్రెయిన్ చురుకుదనం తగ్గిందని. అసలు బ్రెయిన్ అనేది పనిచేస్తోందా అని ప్రశ్నించాడు. కాగా గిల్ క్రిస్ట్ చేసిన ఈ వ్యాఖ్యలపై క్రికెట్ లోకం తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మిస్టర్ కూల్, మ్యాచ్ లను మలుపు తిప్పగల ప్లాన్ వేయడంలో దిట్ట అని పేరు తెచ్చుకున్న ధోనిని అంత మాట అనడం ఆయన అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. కాగా గిల్ వ్యాఖ్యలపై ఇంతవరకు చెన్నై జట్టు గాని, ధోనీ గాని స్పందించలేదు.

Next Story