- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Divya Deshmukh : ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ విజేత దివ్య దేశ్‌ముఖ్
ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ 2025(FIDE Women's Chess World Cup) విజేతగా దివ్య దేశ్‌ముఖ్(Divya DeshMukh) నిలిచింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ 2025(FIDE Women's Chess World Cup) విజేతగా దివ్య దేశ్‌ముఖ్(Divya DeshMukh) నిలిచింది. ఫైనల్లో మరో భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి(Koneru Hampi)పై విజయం సాధించిన దివ్య, కొత్త రికార్డు సృష్టించింది. కాగా గత రెండు రోజుల్లో రెండు గేమ్స్ డ్రా గా ముగియగా.. టై బ్రేకర్ లో దివ్య గెలిచింది. దీంతో 88వ ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ లో గెలిచిన తొలి భారతీయురాలిగా దివ్య రికార్డు నెలకొల్పింది. మహారాష్ట్రకు చెందిన దివ్య దేశ్‌ముఖ్... బాల్యం నుంచి అనేక అంతర్జాతీయ టైటిల్స్ నెగ్గింది.
2023లో ఇంటర్నేషనల్ మాష్టర్ టైటిల్ ను, 2024లో అండర్-20 వరల్డ్ జూనియర్ గర్ల్స్ టైటిల్ నెగ్గింది. విజయం సాధించిన అనంతరం దివ్య ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో దివ్య దేశ్‌ముఖ్ పేరు మారు మ్రోగిపోతోంది.
Also Read..
Next Story






