చరిత్ర సృష్టించిన దివ్య దేశ్‌ముఖ్.. ఫిడే వరల్డ్ కప్‌లో ఫైనల్‌కు

by Harish |

భారత మహిళా ఇంటర్నేషనల్ మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్ చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో నిలిచింది.

చరిత్ర సృష్టించిన దివ్య దేశ్‌ముఖ్.. ఫిడే వరల్డ్ కప్‌లో ఫైనల్‌కు
X

దిశ, స్పోర్ట్స్ : భారత మహిళా ఇంటర్నేషనల్ మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్ చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో నిలిచింది. జార్జియాలో జరుగుతున్న మహిళల ఫిడే వరల్డ్ కప్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. వరల్డ్ కప్ చరిత్రలో టైటిల్ పోరుకు చేరుకున్న తొలి భారత గ్రాండ్‌మాస్టర్‌గా రికార్డుకెక్కింది. అలాగే, వచ్చే ఏడాది జరిగే వరల్డ్ చాంపియన్‌షిప్‌కు క్వాలిఫై అయ్యేందుకు జరిగే క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించింది. బుధవారం ముగిసిన సెమీస్‌లో ఆమె మాజీ వరల్డ్ చాంపియన్, చైనాకు చెందిన టాన్ జోంగీని మట్టికరిపించింది. రెండు గేముల్లో జరిగిన మ్యాచ్‌లో దివ్య 1.5-0.5 తేడాతో విజయం సాధించింది. మంగళవారం జరిగిన తొలి గేములో టాన్ జోంగీతో కలిసి డ్రా చేసుకుంది. ఇక, బుధవారం జరిగిన రెండో గేమును నెగ్గడంతో ఆమె విజయం లాంఛనమైంది. తొలి పావులతో ఆడిన ఆమె 101 ఎత్తుల్లో ప్రత్యర్థిని నిలువరించింది. మరోవైపు, మరో భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి, చైనాకే చెందిన లీ టింగ్జీ మధ్య సెమీస్ ఆసక్తికరంగా సాగుతోంది. రెండో గేములో కూడా ఇద్దరు పాయింట్స్ పంచుకున్నారు. దీంతో రెండు క్లాసికల్ గేమ్స్ ముగిసే సరికి ఇద్దరు 1-1తో సమంగా నిలిచారు. ఇక, ఫైనల్ బెర్త్ కోసం హంపి టై బ్రేకర్‌లోనే తాడోపేడో తేల్చుకోనుంది.


Next Story