- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, స్పోర్ట్స్ : భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ మరోసారి తండ్రయ్యాడు. అతడి భార్య దీపికా పల్లికల్ గురువారం ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని దినేశ్ కార్తీక్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ తన సంతోషాన్ని పంచుకున్నాడు. తమ కూతురికి ‘రాహా’అని పేరు పెట్టినట్టు కార్తీక్ వెల్లడించాడు. దీపికా కూడా స్పోర్ట్స్ పర్సనే. స్క్వాష్‌లో స్టార్ క్రీడాకారిణి. 2015లో కార్తీక్, దీపిక వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇప్పటికే ఇద్దరు కొడుకులు కబీర్, జియాన్. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కార్తీక్ ప్రస్తుతం ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. మరోవైపు, అంతర్జాతీయ స్క్వాష్ ప్లేయర్ దీపిక 2022లో వరల్డ్ డబుల్స్ చాంపియన్‌షిప్ రెండు స్వర్ణాలు, 2023లో ఆసియా గేమ్స్ మిక్స్‌డ్ డబుల్స్‌లో బంగారు పతకం సాధించింది.
Next Story






