- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Digvesh: ఏం కర్మ రా.. ఆదాయం 2, వ్యయం 14
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో.. ఇప్పుడు చర్చ మొత్తం స్పిన్నర్ దిగ్వేష్ గురించే జరుగుతోంది. ఎన్ని సార్

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో.. ఇప్పుడు చర్చ మొత్తం స్పిన్నర్ దిగ్వేష్ గురించే జరుగుతోంది. ఎన్ని సార్లు... ఫైన్స్ వేసిన మనోడి ప్రవర్తన మాత్రం ఏ మాత్రం మారడం లేదు. వికెట్ తీయడం సిగ్నేచర్ సెలబ్రేషన్ చేసుకోవడం కామన్ అయిపోయింది. దానికి తోడు.. వికెట్ తీసిన తర్వాత.. సదరు బ్యాటర్ను ట్రోలింగ్ చేయడం కూడా చేస్తున్నాడు దిగ్వేష్.
దీంతో కోడ్ ఆఫ్ కండక్ట్ కింద... వరుసగా ఫైన్స్ పడుతున్నాయి. అయినప్పటికీ తాజాగా సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో మధ్య మ్యాచ్ లో కూడా రెచ్చిపోయాడు దిగ్వేష్. అనవసరంగా అభిషేక్ శర్మతో గొడవ పెట్టుకుని... ఓ మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో 30 లక్షలకు లక్నో జట్టు దిగ్వేష్ ను కొనుగోలు చేసింది. అయితే ఇందులో 9.37 లక్షలు ఫైన్ రూపంలోనే కోల్పోయాడు. అంటే ఆదాయం రెండు అయితే... వ్యయం 14గా ఉంది. ఇకనైనా దిగ్వేష్ మారి... క్రమశిక్షణగా వ్యవహరిస్తే ఖచ్చితంగా మంచి ప్లేయర్ అవుతాడని అందరూ అంచనా వేస్తున్నారు.






