- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీసీసీఐకి క్షమాపణలు.. నఖ్వీ ఏమన్నాడంటే?.. ఇంకా తలపొగరు తగ్గినట్టు లేదు
ఆసియా కప్ ట్రోఫీని విజేత అయిన టీమిండియాకు అందజేయకుండా పాక్ క్రికెట్ బోర్డు, ఏసియన్ క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ తన వెంట తీసుకెళ్లడం వివాదాస్పదంగా మారింది.

దిశ, స్పోర్ట్స్ : ఆసియా కప్ ట్రోఫీని విజేత అయిన టీమిండియాకు అందజేయకుండా పాక్ క్రికెట్ బోర్డు, ఏసియన్ క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ తన వెంట తీసుకెళ్లడం వివాదాస్పదంగా మారింది. మంగళవారం జరిగిన ఏసీసీ మీటింగ్‌లోనూ నఖ్వీపై బీసీసీఐ వైస్ ప్రతినిధులు ఫైర్ అయ్యారు. నఖ్వీ మాత్రం దాటవేసేందుకు చూశాడు. ఏసీసీ ప్రెసిడెంట్ హోదాలో సమస్యను పరిష్కరించాల్సింది పోయి మరింత జఠిలం చేస్తున్నాడు. తాజాగా నఖ్వీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుతో వివాదం మరింత ముదిరింది. టీమిండియాకు ట్రోఫీ కావాలంటే ఏసీసీ కార్యాలయానికి వచ్చి తన చేతుల మీదుగా తీసుకోవాలంటూ పోస్టు పెట్టాడు. ‘ఏసీసీ ప్రెసిడెంట్‌గా ఆ రోజు ట్రోఫీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు కూడా సిద్ధమే. వాళ్లకు ట్రోఫీ కావాలనుకుంటే ఏసీసీ కార్యాలయానికి రావాలి. నా చేతుల మీదుగా తీసుకోవాలి.’అంటూ రాసుకొచ్చాడు. అలాగే, బీసీసీఐకి తాను క్షమాపణలు చెప్పానంటూ భారతీయ మీడియా అబద్ధం ప్రచారం చేస్తుందన్నాడు. తానేం ఏం తప్పు చేయలేదని, బీసీసీఐకి క్షమాపణలు చెప్పానని వాదించాడు.






