Divya Deshmukh : చెస్ క్వీన్.. దివ్య దేశ్ ముఖ్ గురించి ఈ విషయాలు తెలుసా ?

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-07-28 12:16:58  IST  )

ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ 2025 (Fide Women's Chess World Cup 2025) టైటిల్ విజేతగా నిలిచింది భారత్ కు చెందిన 19 ఏళ్ల యువతి దివ్య దేశ్ ముఖ్.

Divya Deshmukh : చెస్ క్వీన్.. దివ్య దేశ్ ముఖ్ గురించి ఈ విషయాలు తెలుసా ?
X

దిశ, వెబ్‌డెస్క్: ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ 2025 (Fide Women's Chess World Cup 2025) టైటిల్ విజేతగా నిలిచింది భారత్ కు చెందిన 19 ఏళ్ల యువతి దివ్య దేశ్ ముఖ్. జులై 28న కోనేరు హంపి (Koneru Hampi)తో జరిగిన టై బ్రేకర్ లో విజయం సాధించి.. చెస్ క్వీన్ (Chess Queen 2025)గా నిలిచింది. 2005, డిసెంబర్ 9న మహారాష్ట్రలోని నాగ్ పుర్ లో జితేంద్ర దేశ్ ముఖ్, నమ్రతా దేశ్ ముఖ్ దంపతులకు జన్మించింది దివ్య. తల్లిదండ్రులు వృత్తి రీత్యా డాక్టర్లు. దివ్యకు ఐదేళ్ల వయస్సు నుంచే చెస్ పై ఇంట్రెస్ట్ ఉండటం చూసిన తల్లిదండ్రులు ఆమెకు ఆ ఆటలో శిక్షణ ఇప్పించారు. భవన్స్ భగవాన్ దాస్ పురోహిత్ విద్యామందిర్లో ప్రాథమిక విద్య అభ్యసించింది.

దివ్య దేశ్ ముఖ్ (Divya Deshmukh).. ఏడేళ్ల వయసులోనే తొలి జాతీయ టైటిల్ నెగ్గింది. అలాగే ఒలింపియాడ్ లో మూడుసార్లు గోల్డ్ మెడలిస్ట్ గా నిలిచింది. వరల్డ్ జూనియర్ ఛాంపియన్ షిప్, వరల్డ్ యూత్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్స్ గెలుచుకున్న దివ్య.. 2023లో ఇంటర్నేషనల్ చెస్ మాస్టర్ గా రాణించింది. 2024లో ఫిడే వరల్డ్ అండర్ 20 గర్ల్స్ చెస్ ఛాంపియన్ గా గెలిచి.. ఈ అరుదైన ఘనత సాధించిన నాల్గవ భారత క్రీడాకారిణిగా నిలిచింది. ఈ ఏడాది వరల్డ్ ర్యాపిడ్ అండ్ బ్లిడ్జ్ టీమ్ చెస్ ఛాంపియన్ షిప్ లో ప్రపంచ నంబర్ 1 క్రీడాకారిణి హోయిఫాన్ పై విజయం సాధించింది.

కొత్త కొత్త ప్లేస్ లు చూడటం, సముద్రంలో బోటింగ్ చేయడం దివ్యకు చాలా ఇష్టమట. తన ట్రిప్స్ కు సంబంధించిన వీడియోలను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంటుంది. అద్దం ముందుండి సెల్ఫీ తీసుకోవడం కూడా ఆమెకున్న హాబీస్ లో ఒకటి. తాను చెస్ క్వీన్ గా ఎదగడానికి కారణం తల్లిదండ్రులేనని దివ్య గర్వంగా చెప్తుంది. చెస్ ప్లేయర్ కాకపోయి ఉండుంటే తన పేరెంట్స్ లాగే డాక్టర్ లేదా.. ఆస్ట్రోనాట్ అయ్యేదాన్ని అని గతంలో కొన్నిసార్లు దివ్య చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దేశంలో చెస్ మాస్టర్స్ ర్యాంకింగ్స్ లో సెకండ్ ప్లేస్ లో ఉంది.

Also Read..

Divya Deshmukh : ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ విజేత దివ్య దేశ్‌ముఖ్

Next Story